iPhone 15 delay : ఆ మోడల్ ఐఫోన్ కావాలంటే.. రెండు నెలలు ఆగాల్సిందే!

By :  Bharath
Update: 2023-09-18 11:56 GMT

ఫోన్ 15 సిరీస్ లాంచ్ అయింది. అద్భుతమైన, యూజర్లకు అవసరమైన కొత్త ఫీచర్లతో ఈ సిరీస్ను తీసుకొచ్చారు. వండర్లస్ట్ ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్తో పాటు వాచ్‌ సిరీస్‌ 9, వాచ్‌ అల్ట్రా 2ను మార్కెట్లోకి లాంచ్ చేశారు. వీటిలో కొన్నింటిని రీసైకిల్డ్ మెటీరియల్‌తో తయారుచేశారు. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు 48 మెగాపిక్సల్‌ కెమెరా, 24 ఎంఎం, 28 ఎంఎం, 38 ఎంఎం లెన్స్‌తో ఈసారి టాప్ ఫీచర్స్ను తీసుకొచ్చారు. సెప్టెంబర్ 15 నుంచి ప్రీబుకింగ్ కూడా మొదలయ్యాయి. సెప్టెంబర్ 22 నుంచి విక్రయాలు ఉంటాయి. కాగా మన దేశంలో ట్యాక్స్ తో కాస్త ఎక్కువ ధర ఉన్నా.. ఈ కామర్స్ సైట్ల ద్వారా కాస్త డిస్కౌంట్లతో మొబైల్ పొందొచ్చు. అయితే కొన్ని మోడల్స్ కోసం దాదాపు రెండు నెలల వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఐఫోన్ 15 సిరీస్ లో టాప్ వేరియంట్లు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లోని బ్లూ టైటానియం, బ్లాక్‌ టైటానియం కలర్‌ వేరియంట్లు అక్టోబర్‌ మూడోవారంలో కస్టమర్ చేతికి రానున్నాయి.

వీటితో పాటు నేచురల్‌ టైటానియం, వైట్‌ టైటానియం వేరియంట్ల కోసమైతే నవంబర్‌ రెండోవారం వరకు వెయిట్ చేయాల్సిందే. వేరియంట్లతో సంబంధం లేకుండా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడల్ అక్టోబర్ మూడో వారంలో అందుబాటులోకి వస్తుంది. అయితే 1టీబీ స్టోరేజ్ వేరియంట్ వైట్ టైటానియం మాత్రం సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఐఫోన్ 15, ఐఫోన 15 ప్లస్ బేస్ వేరియంట్ల డెలివరీ కూడా కాస్త ఆలస్యం అవుతుంది. సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలో సేల్స్ లో ఉండే అవకాశం ఉంది.

Tags:    

Similar News