ఐఫోన్ కు ఉన్న క్రేజ్ మరే ఇతర ఫోన్ కు ఉండదు. తాజాగా రిలీజ్ అయిన ఐఫోన్ 15 సిరీస్.. ఫీచర్లు, కెమెరా బాగుండటంతో జనాలు ఎగబడి కొంటున్నారు. స్టాక్ లేదంటే.. వచ్చే వరకు క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. అంతా బాగుంది అనుకున్న టైంలో కొత్త సమస్య వచ్చి పడింది. దీంతో ఈ ఐఫోన్ మాకొద్దు బాబోయ్ అంటూ.. కొనుగోలు దారులు ఫోన్లను.. రిటర్న్ చేస్తున్నారు. కంపెనీకి ఫిర్యాదులు చేస్తూ.. దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఐఫోన్లలో సెక్యూరిటీతో పాటు ఫీచర్లు బాగుంటాయనే తీసుకుంటారు. అందులో హీటింగ్ సమస్య ఉండకపోవడం కూడా యాపిల్ కు ప్లస్సే. అయితే తాజాగా రిలీజ్ అయిన ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లలో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఫోన్ కాల్ కాసేపు మాట్లాడినా, చార్జింగ్ పెట్టినా, గేమ్స్, వీడియో చాట్ చేసినా ఫోన్ విపరీతంగా హీట్ ఎక్కుతోందట. స్క్రోన్, ఫోన్ వెనక భాగాన్ని అసలు పట్టుకోలేకపోతున్నారట. ముఖ్యంగా ఈ సమస్య చార్జింగ్ పెట్టినప్పుడు ఎక్కువగా ఉంటుందని యూజర్లు చెప్తున్నారు. ఈ విషయంపై కంపెనీకి ఫిర్యాదు చేశారు.
కస్టమర్ల కంప్లైట్స్ పై యాపిల్ టెక్నికల్ టీం స్పందించింది. iOS 17 అప్ డేట్ వల్లే ఈ సమస్య తలెత్తిందని చెప్తున్నారు. iOS 17 అప్ డేట్ లో బగ్ సమస్య ఏర్పడింది. దీనివల్లే ఈ ఐఫోన్ 15 ప్రో మోడల్ హ్యాండ్సెట్లు వేడెక్కుతున్నాయి. అంతేకాకుండా యూజర్లు డౌన్ లోడ్ చేసే కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ కూడా సిస్టమ్ ను ఓవర్లోడ్ చేస్తాయి. వాటి వల్లే యాపిల్ ఫోన్లు ఎక్కువగా వేడెక్కుతున్నాయట. ఈ విషయంలో ఎలాంటి భయం అవసం లేదని.. త్వరలోనే బగ్ ఫిక్స్ చేస్తామని యాపిల్ ప్రకటించింది.