వచ్చే నెలలో I Phone 15 లాంఛ్.. బుకింగ్స్ ఎప్పటి నుంచంటే..?
యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ సెప్టెంబర్ లో మార్కెట్లోకి వచ్చే ఛాన్సుంది. లాంఛ్ ఈవెంట్ అక్టోబర్‌కు పోస్ట్ పోన్ కానుందని గతంలో వార్తలు వచ్చినా యాపిల్ మాత్రం సెప్టెంబర్ లోనే నిర్వహించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. సెప్టెంబర్ 13న యాపిల్ ఐ ఫోన్ 15 లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐ ఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు ఉండనున్నాయి. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్స్‌లో యాపిల్ ఏ16 ప్రాసెసర్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లలో యాపిల్ ఏ17 బయోనిక్ ప్రాసెసర్లు ఉండే అవకాశముంది.
సెప్టెంబర్ 13న సెలవు తీసుకోవద్దని యాపిల్ తన ఉద్యోగులకు మెయిల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి యాపిల్ తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లను ఎప్పుడూ సెప్టెంబర్‌లోనే లాంఛ్ చేస్తుంది. 2022లో సెప్టెంబర్ 7న ఐఫోన్ 14 సిరీస్ లాంఛ్ అయిన ‘ఫార్ అవుట్’ ఈవెంట్ జరిగింది. ఐ ఫోన్ 14, ఐ ఫోన్ 14 ప్లస్, ఐ ఫోన్ 14 ప్రో, ఐ ఫోన్ 14 ప్రో మ్యాక్స్‌కు సంబంధించిన ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 9న ప్రారంభమయ్యాయి. యాపిల్ అదే టైం లైన్ ఫాలో అయితే ఐఫోన్ 15 సిరీస్ ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 15 నుంచి షురువయ్యే ఛాన్సుంది. గతంలో వచ్చిన లీకులు పరిశీలిస్తే ఐఫోన్ 15 సిరీస్‌లో యూఎస్‌బీ టైప్-సీ పోర్టు అందించే అవకాశముంది. ఐఫోన్ 15 అన్ని మోడల్స్‌లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ కూడా ఉండనుందని తెలుస్తోంది.
మరోవైపు ఎంతో కాలంగా వార్తల్లో ఉన్న ఐఫోన్ ఎస్ఈ 4 ఐ ఫోన్ 14 తరహా డిజైన్తో బడ్జెట్ రేంజ్ లో రానుందని టాక్ వినిపిస్తోంది. మొదట యాపిల్ ఈ ఫోన్‌ను 2024లో లాంచ్ చేయనుందని న్యూస్ వచ్చినా.. ఐ ఫోన్ ఎస్ఈ న్యూ జనరేషన్ మోడల్ లాంఛ్ 2025కు పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది.