Title IQOO 12 5G : ఐకూ నుంచి కొత్త ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..?
కస్టమర్లను ఆకట్టుకునేందుకు స్మార్ట్ ఫోన్ కంపెనీలు సరికొత్త మోడల్స్తో మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల సంస్థలు న్యూ మోడల్స్‌తో ఆకట్టుకుంటున్నాయి. కొత్త మెడల్స్ మాత్రమే కాదు మంచి ఆఫర్లతో జనాలను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఐకూ కొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ముందుగా చైనా మార్కెట్లో విడుదల చేయనున్న ఈ ఫోన్‌ను ఆ తర్వాత భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నారు.
ఐకూ 12 5జీ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఐకూ 12, ఐకూ 12 ప్రో పేర్లతో ఈ ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఐకూ 11 సిరీస్‌కు కొనసాగింపుగా ఇవి భారత మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ 6.78 ఇంచెస్ అమోల్డ్ డిస్ ప్లేతో పాటు 144Hz రిఫ్రెష్ రేట్తో మార్కెట్లోకి వస్తుంది. ఈ ఫోన్లో 64MP రియర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 120W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీ ఉంది. డిసెంబర్ 12 నుంచి ఈ ఫోన్ కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో విడుదల కావొచ్చని తెలుస్తోంది. 12GB+256GB వేరియంట్ ధర రూ.45,000 వరకు ఉండొచ్చు. అదే విధంగా 16GB+512GB మోడల్ ధర రూ.50 వేలు, 16GB RAM+1TB స్టోరేజీతో వచ్చే ఫోన్ ధర రూ.53 వేల వరకు ఉండే అవకాశముంది