iQOONeo9Pro : వన్ప్లస్ 12Rకు పోటీగా.. ఐకూ Neo 9Pro.. లెదర్ ఫినిష్, ఫ్లాగ్షిప్ ఫీచర్స్తో ఇండియన్ మార్కెట్లోకి

Byline :  Bharath
Update: 2024-02-05 11:14 GMT

గతేడాది రిలీజ్ అయిన iQOO Neo 7 ఫోన్.. తక్కువ ధరలో, ఫ్లాగ్ షిప్ ఫీచర్స్ తో మార్కెట్ లో విడుదలైంది. ఇప్పుడు దానికి సక్సెసర్ గా ఐకూ నియో 9 ప్రో ఫోన్ ను ఇండియన్ మార్కెట్ లోకి తీసుకురానుంది. ఫిబ్రవరి 22వ తేదీన విడుదల కానున్న ఈ ఫోన్.. ముందే స్పెసిఫికేషన్స్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. iQOO Neo 7తో పోల్చితే.. iQOO Neo 9 Pro ఫోన్ ను మూడు కేటగిరీల్లో అన్ గ్రేడ్ చేసి తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కెమెరా, ప్రాసెసర్, లుక్స్ లో మరింత బెటర్ చేసినట్లు కంపెనీ తెలిపింది. వైబ్రేంట్ కలర్స్, లెదర్ ఫినిష్ తో ఫోన్ చూడ్డానికి చాలా అట్రాక్టివ్ గా ఉన్న ఈ ఫోన్.. వన్ ప్లస్ 12 సిరీస్ కు గట్టి పోటీ ఇవ్వనుంది.




 


iQOO Neo 9 Pro specifications:

iQOO Neo 9 Pro సరికొత్త ఫీచర్స్ వస్తున్న ఈ ఫోన్.. స్టార్టింగ్ ధర రూ. 40వేల కంటే తక్కువే. వన్ ప్లస్ కు గట్టి పోటీనిచ్చే iQOO.. ఈసారి కూడా OnePlus 12R కంటే తక్కువ ధరకే తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ లో 50-మెగాపిక్సెల్ సోనీ IMX920 మెయిన్ కెమెరా.. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. 6.78 అంగుళాల Amoled డిస్‌ప్లే,144హెడ్జ్ రీఫ్రెష్ రేట్ తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ వరర్ ఫుల్ ప్రాసెసర్ తో తీసుకొస్తున్నారు. ఈసారి బేస్ వేరియంట్.. 8GB RAM + 256GBతో తీసుకొస్తున్నారు. మరో వేరియంట్ 12GB + 256GBగా రాబోతుంది. ఈ మొబైల్ 5,160mAh బ్యాటరీ.. 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఇందులో మెయిన్ హైలైట్. కాగా పూర్తి వివరాలు ఫోన్ లాంచ్ ఫిబ్రవరి 22 నాడు తెలుస్తాయి.




Tags:    

Similar News