ISRO Chairman Dance : చంద్రయాన్ 3 సక్సెస్.. స్టెప్పులేసిన ఇస్రో ఛైర్మన్
By : Mic Tv Desk
Update: 2023-08-24 07:53 GMT
చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశం భారత్ చరిత్ర సృష్టించింది. జాబిల్లి ఉపరితల అన్వేషణలో ఇస్రో అద్భుత విజయం సాధించింది. చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై కాలు మోపిన మరుక్షణం దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. చందమామపై భారత జెండా ఎగరేసేందుకు శ్రమించిన ఇస్రో సైంటిస్టుల ఆనందానికి సైతం అవధుల్లేకుండా పోయింది.
చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత ఇస్రో సైంటిస్టులు డ్యాన్సు చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ కూడా సహచర సైంటిస్టులు, అధికారులు, సిబ్బందితో కలిసి స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియో చూసిన నెటిజన్లంతా ఇస్రో సిబ్బంది కృషి, అంకితభావాన్ని ప్రశంసిస్తున్నారు.