సరికొత్త జోష్‌‌లో ఇస్రో..ఈసారి సూర్యుడిపై గురి..!

Update: 2023-08-14 09:01 GMT

చంద్రుడిపై అధ్యయనం కోసం చంద్రయాన్-3 ప్రయాగాన్ని విజయం వంతం చేసిన కొన్ని రోజులకే ఇస్రో మరో అన్వేషణకు సిద్దమవుతోంది. ఈ సారి సూర్యుడిపై గురిపెట్టింది. ఓ కొత్త మిషన్‌ను త్వరలోనే సూర్యుడి వద్దకు పంపించనుంది. దీనికి సంబంధించిన,చిత్రాలను విషయాలను ఇస్రో వెల్లడించింది. దానికి తగిన విధంగా ఆదిత్య-ఎల్1 అని పేరు పెట్టారు. ఇది

ఇది సూర్యుడిపై ప్రయోగానికి భారత్ చేపడుతున్న మొట్టమొదటి మిషన్.

ఆదిత్య -ఎల్1 మిష‌న్‌లో భాగంగా కేవ‌లం సూర్య‌ుడిపైనే వివిధ పరిశోధనలు చేయనున్నారు. 1500 కిలోల బ‌రువు ఉన్న ఈ ఆదిత్య-ఎల్ 1 ఫోటోస్పియ‌ర్‌, క్రోమోస్పియ‌ర్‌ను అధ్యయనం చేసేందుకు ఏడు పేలోడ్స్‌తో నింగిలోకి పంపించనున్నారు. సౌర తుఫాన్ల స‌మ‌యంలో జ‌రిగే మార్పుల‌పై ఈ శాటిలైట్ అధ్యయనం చేయనుంది. ఈ ప్రయోగంలో భాగంగానే సూర్యుడి ఉప‌రిత‌లంపై కూడా పరిశోధనలు చేయ‌నున్నారు. ప్రధానంగా సూర్యుడు మండుతున్న సమయంలో ఏమి జరుగుతుందో శోధించనున్నారు. సౌర తుఫాన్లపై ఇది ఓ కన్నేసి ఉంచనుంది.

ఈ ఆదిత్య - ఎల్1 ప్రయోగాన్ని బెంగళూరులోని యూఆర్‌రావు శాటిలైట్‌ సెంటర్‌లో తయారు చేశారు. అక్కడి నుంచి షార్‌కు ఆదివారం సాయంత్రం భారీ సీఆర్‌పీఎఫ్ బందోబస్తు మధ్య ఉపగ్రహాన్ని చేర్చారు. ఆదిత్య -ఎల్1 ఉపగ్రహాన్ని సెప్టెంబర్ మొదటి వారంలో ప్రయోగించనున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు.



Tags:    

Similar News