Chandrayaan-3 Mission sucess : ఇస్రోలో శాస్త్రవేత్తల సంబరాలు..

Update: 2023-08-23 13:23 GMT

ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 విజయవంతమైంది. 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోసుకెళ్లిన చంద్రయాన్ -3 జాబిల్లిపై అడుగుపెట్టింది. ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని దక్షిణ ధృవంపై 6.03 గంటలకు కాలుమోపి మోపి భారత్ సత్తాను విశ్వానికి చాటి చెప్పింది. జాబిల్లి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ అవతరించింది. అమెరికా, రష్యా, చైనాలకు అందని ద్రాక్షలా ఉన్న ఈ ప్రయోగాన్ని భారత్ చేసి చూపెట్టింది. చంద్రయాన్‌ -3 సక్సెస్‌ పట్ల ఇస్రోకు అభినందనలు దేశ విదేశాల నుంచి అభినందనలు వెలువెత్తుతున్నాయి.

చందమామపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతమవ్వడంతో బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఒకరికొకరు అభినందనలు తెలుపుకొని ఉప్పొంగిపోయారు. వర్చువల్‌గా బెంగళూరు కేంద్రంలోని శాస్త్రవేత్తలపై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రయాన్ -3 విజయవంతంపై దేశ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎంతో ఉత్కంఠతతో ప్రత్యక్ష్య ప్రసారాన్ని చూసిన కోట్లాది మంది భారతీయులు పట్టరాని సంతోషానికి లోనయ్యారు. చంద్రయాన్‌ -3 విజయం కోసం ఎందరో భారతీయులు ప్రత్యేక పూజలు, హోమాలు కూడా చేశారు.

Tags:    

Similar News