Reliance Jio: రిలయన్స్ జియో 'రిపబ్లిక్‌ డే ఆఫర్‌'.. అద్భుతమైన డేటా బెనిఫిట్స్

Byline :  Veerendra Prasad
Update: 2024-01-17 06:28 GMT

ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో.. తన కస్టమర్లకు రిపబ్లిక్ డే ఆఫర్ ప్రకటించింది.రూ. 2999తో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తో ఏడాది పాటు కాల్స్. ఇంటర్నేట్ సౌకర్యంతో పాటుగా కూపన్‌లు ప్రకటించింది. రూ.2,999తో రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 2.5 జీబీ డేటా చొప్పున 912.5 జీబీ వస్తుంది. ఏడాది పాటు జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమా ఫ్రీగా చూడవచ్చు. అంతేకాకుండా అదనంగా నెట్‌మెడ్స్‌, అజియో, ఇక్సిగో, తిరా, స్విగ్గీ కూపన్లను జియో అందిస్తోంది. 2024 జనవరి 15 నుంచి జనవరి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. లాంగ్‌ టర్మ్‌ ప్లాన్‌ కోసం ఎదురుచూస్తున్నవారు ఈ ప్లాన్‌ను పరిశీలించొచ్చు.

జియోలో రూ.2,499 పైగా షాపింగ్‌ చేస్తే రూ.500 డిస్కౌంట్‌ లభిస్తుంది. ఆన్‌లైన్‌ బ్యూటీ ప్రొడక్ట్‌ ప్లాట్‌ఫామ్‌ తిరా లో రూ.1000, అంత కంటే ఎక్కువ మొత్తంలో చేసే కొనుగోళ్లపై 30శాతం డిస్కౌంట్‌ ఉంటుంది. ఇక్సిగో లో విమాన టికెట్ల బుకింగ్‌పై రూ.1,500 తగ్గింపు పొందొచ్చు. స్విగ్గీ ద్వారా చేసే కొనుగోళ్లపై రూ.125 విలువైన రెండు డిస్కౌంట్‌ కూపన్లు రీఛార్జి ద్వారా లభిస్తాయి. రిలయన్స్‌ డిజిటల్‌లో రూ.5వేల కొనుగోలుపై 10శాతం డిస్కౌంట్‌ ఉంటుంది. జియో రూ. 2999తో రీఛార్జ్‌ చేసుకుంటే మైజియో కౌంట్​లోకి ట్రాన్స్​ఫర్​ అవుతాయి. వాటిల్లోని కోడ్స్​ని కాపీ చేసుకుని, పార్ట్​నర్​ యాప్స్​/ వెబ్​సైట్స్​లో అప్లై చేసుకుంటే డిస్కౌంట్‌ పొందొచ్చు.అయితే కూపన్లకు ఎక్స్​పైరీ డేట్​ ఉంటుంది. ఈ ఆఫర్ జనవరి 15 నుంచి 31 వరకు అందుబాటులో ఉంటుంది. రిలయన్స్ జియో 2015 డిసెంబరు 27న ప్రారంభమైంది. దేశంలో అతి పెద్ద మొబైల్ నెట్ వర్క్ ఆపరేటర్ గా, ప్రపంచంలో మూడో అతి పెద్ద మొబైల్ నెట్ వర్క్ ఆపరేటర్ గా ఉంది. 42.62 కోట్ల వినియోగదారులు సంస్థకు ఉన్నారు. నవీ ముంబయిలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. 4జీతోపాటు 5జీ సేవలను కూడా అనేక నగరాల్లో జియో అందిస్తోంది.  




Tags:    

Similar News