దేశంలో ఉన్న అన్ని టెలికాం సంస్థలకు దెబ్బ కొడుతూ ఎంట్రీ ఇచ్చింది స్వదేశీ సంస్థ రిలయన్స్ జియో. జియో దెబ్బకు అన్ని కంపెనీలు దిగొచ్చి టారిఫ్ రేట్లు తగ్గించాయి. కాగా జియో తన 7వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తన యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న కొన్ని ప్రిపెయిడ్ రీచార్జ్ ప్లాన్లకు అదనంగా మరిన్ని ఫీచర్లను జోడించింది.
ఇదివరకు రూ.299 ప్లాన్ తో రీఛార్జిపై 28 రోజుల పాటు అపరిమిత కాల్స్, 100 SMSలతో పాటు రోజుకు 2 GB డేటా వస్తాయి. అయితే దీనికి అదనంగా 7 GB డేటా పొందొచ్చు. అలాగే, రూ.749 రీఛార్జ్ పై 90 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 GB డేటా పొందుతున్నారు. దానితోపాటు ఇప్పుడు అదనంగా 14 జీబీ లభిస్తుంది. రూ.2999 రీఛార్జ్ కు ఏడాది వ్యాలిడిటీతో రోజుకు 2.5 జీబీ డేటా పొందొచ్చు. దానికి అదనంగా 21 జీబీ అదనపు డేటా లభిస్తుంది. వీటితో పాటు మెక్ డోనాల్డ్స్, రిలయన్స్ డిజిటల్ లో 10 శాతం తగ్గింపు, విమాన బుక్కింగ్స్ పై రూ.15,00 వరకు తగ్గింపు, హోటళ్లపై 15 శాతం, AJIOపై 20 శాతం తగ్గింపు, నెట్‌మెడ్స్‌పై 20 శాతం డిస్కౌంట్స్ పొందొచ్చు. అయితే, ఈ ఆఫర్లు కేవలం సెప్టెంబర్ 30 వరకే వర్తిస్తాయి.