ఇండియాలో ఆటో మొబైల్ మార్కెట్‌లోని ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మంట్‌పై కియా మోటార్స్ ఫోకస్ చేసింది.
ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ, ఇండియాలో లాంచ్‌కు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అంతార్జాతీయంగా అధికంగా సెల్లింగ్‌గా ఉన్న కియా ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్ యూవీనీ 2024లో ఇండియాలో విడుదల చేస్తామని గతంలో చెప్పింది. తాజగా కియా ఈవీ9 సంబంధించిన కీలక అప్డేట్ బయటికి వచ్చింది. ఈ కారుని త్వరలో మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.
కియా ఈవీ9 ఫీచర్స్..
కియా ఈవీ9 అనేది ఒక ప్రీమియం కారు. ఇందులో బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్, వర్టికల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, ఫ్లష్ ఫిట్టెడ్ డోర్ హ్యాండిల్స్ వంటివి వస్తున్నాయి. ఇందులో 21 ఇంచ్ డ్యూయెల్ టోన్ వీల్స్ ఉంటాయి.ఇక ఈ 3 రో ఎలక్ట్రిక్ వెహికిల్ ఇంటీరియర్ చాలా స్పేషియస్గా ఉంటుంది. డిజైన్ మినిమలిస్ట్‌గా ఉంటుంది. 4 స్పోక్ స్టీరింగ్ వీల్, పానారోమిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్- ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ కోసం భారీ స్క్రీన్ వంటివి వస్తున్నాయి.ఈ-జీఎంపీ (ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్)పై ఈ కియా ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని రూపొందించింది కియా మోటార్స్.
దీని పొడవు 5,000ఎంఎం. వీల్‌బేస్ 3,1000ఎంఎం. సైజు పరంగా చూసుకుంటే.. ఈ వెహికిల్ చాలా పెద్దదే. అంతర్జాతీయంగా ఉన్న కియా ఈవీ9లో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి.. 76.1 కేడబ్లూహెచ్, 99.8 కేడబ్ల్యూహెచ్. ఈ ఈవీ రేంజ్ 540కి.మీలు. 800వోల్ట్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ కియా ఎలక్ట్రిక్ వెహికిల్‌కి లభిస్తోంది. మరి ఇండియాలో.. ఏ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది? అనేది వేచి చూడాలి. కియా ఈవీ9 ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. కానీ ఇదొక ప్రీమియం కారు కాబట్టి.. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 40లక్షల కన్నా ఎక్కువగానే ఉంటుంది మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కియా ఈవీ9 ఇతర ఫీచర్స్, లాంచ్ డేట్‌పైనా క్లారిటీ లేదు. త్వరలోనే ఈ మోడల్‌పై కియా కంపెనీ ప్రకటన చేసే అవకాశం ఉంది.