KTM RC 390 bike 2024: రైడర్స్ స్పెషల్.. స్టైలిష్, కలర్ ఫుల్ లుక్స్తో కొత్త KTM RC 390.. ధర ఎంతో తెలుసా?

By :  Bharath
Update: 2024-02-02 10:34 GMT

మోటార్ ఫీల్డ్ లో కాంపిటీషన్ పెరిగిపోతుంది. కస్టమర్లను ఆకర్షించేందుకు, వాళ్ల అవసరాలకు తగ్గట్లు.. కంపెనీలు కొత్త కొత్త మోడల్స్ ను తీసుకొస్తున్నాయి. దాంతో పాటు ఉన్న మోడల్స్ కు అప్ గ్రేడ్ వర్షన్స్ తీసుకొస్తున్నాయి. ఇప్పుడు బజాజ్ ఆటో కేటీఎం.. ఆర్సీ 390 బైక్ ను తీసుకొస్తుంది. ఈ స్పోర్ట్స్ బైక్ ఎక్స్ షోరూం ధర రూ.3.14 లక్షలుగా నిర్ణయించారు. స్టైలిష్, కలర్ ఫుల్ లుక్స్ తో.. కొత్త రంగుల్లో ఈ బైక్ రాబోతుంది. రేసింగ్ బ్లూ (Racing Blue), ఎలక్ట్రిక్ ఆరెంజ్ (Electric Orange) రంగుల్లో అందుబాటులోకి రానుంది.

ఈ బైక్ హెడ్ ల్యాంప్ ను పూర్తి కొత్తగా రూపొందించారు. ఇందులో డే లైట్, రన్నింగ్ లైట్స్ రెండూ అందుబాటులో ఉన్నాయి. కొత్తగా ఫిక్స్ చేసిన బ్లూటూత్ డివైజ్ కనెక్టివిటీ ఫీచర్ తో.. యాంబియెంట్ లైటింగ్ తో ఉన్న టీఎఫ్టీ ఇన్ స్ట్రమెంట్ క్లస్టర్ ను ఏర్పాటుచేశారు. KTM RC 390 2024లో పవర్ ఫుల్ 373.27cc ఇంజిన్ ఉంటుంది. లిక్విడ్ కూలింగ్, సింగిల్ సిలిండర్, 4 వాల్వ్ పెట్రోల్ ఇంజిన్, 42hp పీక్ పవర్, 9000 rpm, 37Nm టార్క్, 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉన్నాయి. ఇది 9000 rpm వద్ద 42.9 42.9 hp ఔట్ పుట్ ను.. 7000 rpm వద్ద 37 Nm of torqueను ఇస్తుంది. 13.7 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, కార్నర్స్ లో స్కిడ్ కాకుండా కార్నరింగ్ ఏబీఎస్ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి.




Tags:    

Similar News