Chandrayaan-3: చంద్రుడిపై ల్యాండింగ్... ఆ 17 నిమిషాలే కీలకం
జాబిల్లిపై మన వ్యోమనౌక అడుగుపెట్టే ఆ చారిత్రక క్షణాల కోసం యావత్ భారతదేశం వేయికళ్లతో ఎదురుచూస్తుంది. మరి కొన్ని గంటల్లో చంద్రుడిపై చంద్రయాన్-3 కాలు మోపనుంది. లక్ష్యం దిశగా పైయనించిన చంద్రయాన్-3.. బుధవారం సాయంత్రం 6:04 గంటలకు చంద్రుడిపై దిగనుంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ చంద్రుడికి మరింత దగ్గరైంది. ఆ అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది.
ల్యాండింగ్ మాడ్యూల్ సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే క్రమంలో చివరి 17 నిమిషాలు ఎంతో కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బుధవారం సాయంత్రం 5.45 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు అంచనా వేస్తున్నారు. సూర్యుడి వెలుతురు రాగానే నిర్దేశిత ప్రదేశంలో, అనుకున్న టైంకు ల్యాండింగ్ చేపట్టనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ల్యాండింగ్ ప్రక్రియ పూర్తిగా స్వతంత్రమైంది. ల్యాండర్ దాని పని అదే చేసుకోవాలి. సరైన ఎత్తులో, సరైన టైంలో, సరిపడా ఇంధనాన్ని ఉపయోగించుకుని ల్యాండర్ తన ఇంజిన్లను మండించుకోవాలి. దాని తర్వాత సురక్షిత ల్యాండింగ్ కోసం సేఫ్ ప్లేస్ ను స్కాన్ చేసి కిందకు ల్యాండ్ కావాల్సి ఉంటుంది.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 22, 2023
The mission is on schedule.
Systems are undergoing regular checks.
Smooth sailing is continuing.
The Mission Operations Complex (MOX) is buzzed with energy & excitement!
The live telecast of the landing operations at MOX/ISTRAC begins at 17:20 Hrs. IST… pic.twitter.com/Ucfg9HAvrY