మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 30 ఏళ్ల సేవలకు గుడ్ బై

Byline :  Aruna
Update: 2023-09-04 11:54 GMT

ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్ నుంచి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో వర్డ్ ప్యాడ్ అనే ఫీచర్ ఉండదని స్పష్టం చేసింది. 30 ఏళ్లుగా యూజర్లకు సేవలందిస్తున్న వర్డ్ ప్యాడ్ కు ఇక స్వస్తి చెప్తున్నట్లు ప్రకటించింది. 1995లో మైక్రోసాఫ్ట్ విండోస్ ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టమ్)ను లాంచ్ చేసింది. ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేయబోయే ఆపరేటింగ్ సిస్టమ్ లో వర్డ్ ప్యాడ్ అనే వర్డ్ ప్రాసెసింగ్ టూల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిద్వారా రెజ్యూమ్, లెటర్స్ ను తయారు చేసుకోవచ్చు.

టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫొటోలు కూడా యాడ్ చేయొచ్చు. నోట్ ప్యాడ్ లో లేని ఇటాలిక్, అండర్ లైన్, బుల్లెట్ పాయింట్స్, నెంబరింగ్, టెక్ట్స్ ఎలైన్ మెంట్స్ లాంటి అడ్వాన్స్ ఫీచర్లను తీసుకొస్తోంది. ఈ క్రమంలో వర్డ్ ప్యాడ్ కు ప్రత్యామ్నాయంగా ఆఫీస్ 365 పెయిడ్ సబ్ స్క్రిప్షన్ లో ఉన్న మైక్రోసాఫ్ట్ వర్డ్ ను ఉపయోగించుకోవాలని సంస్థం కోరింది. కోరింది. రిచ్‌ టెక్స్‌ డాక్యుమెంట్స్‌ కోసం మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌, డీవోసీ అండ్‌. ఆర్టీఎఫ్‌,ప్లెయిన్‌ టెక్ట్స్‌ డాక్యుమెంట్ కోసం విండోస్‌ నోట్‌ప్యాడ్‌లను వినియోగించుకోవాలని సూచించింది.


Tags:    

Similar News