ఈ 18 యాప్స్‌ ఉంటే డేంజర్లో ఉన్నట్లే.. వెంటనే డిలీట్ చేయండి!

By :  Shabarish
Update: 2024-02-20 16:49 GMT

ఆండ్రాయిడ్ ఫోన్ వాడేవారిని గూగుల్ హెచ్చరించింది. సాధారణంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి కొన్ని యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటూ ఉంటాం. అయితే అందులో చాలా వరకూ డేంజరస్ యాప్‌లే ఉంటున్నాయి. గేమ్ ఆడే విషయం దగ్గరి నుంచి ఫోటోలు తీసే వరకూ ప్రతి దానికీ అనేక యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటూ ఉంటాం. అయితే వాటిలో కొన్ని యాప్స్ వల్ల ప్రమాదం పొంచి ఉందని గూగుల్ హెచ్చరిస్తూ ఉంటుంది. అటువంటి యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగిస్తూ ఉంటుంది.

ఈమధ్య కాలంలో నకిలీ యాప్‌లు విపరీతంగా పుట్టుకొస్తున్నాయి. వాటిని గూగుల్ ప్లేస్టోర్ తొలగిస్తూ వస్తోంది. తాజాగా 18 యాప్‌లను గూగుల్ తొలగించింది. ఒక వేళ ఆ యాప్స్ మీ స్మార్ట్ ఫోన్లో ఉంటే వెంటనే అన్ ఇన్‌స్టాల్ చేయడం ఎంతో మంచిది. ఈ 18 యాప్‌లల్లో స్పైలోన్ మాల్వేర్‌ను గూగుల్ గుర్తించింది. ఈ యాప్స్ ఫోన్లో ఉంటే పర్సనల్ డేటా అనేది దొంగిలించబడుతుంది. స్పైలోన్ అనేది ఈ 18 యాప్‌లల్లో కనిపించే ఒక మాల్వేర్ అని, దానివల్ల హ్యాకర్లు సులభంగా డేటాను తీసుకుంటారని గూగుల్ హెచ్చరించింది. కాబట్టి ఈ 18 యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి.

తొలగించాల్సిన యాప్స్ ఇవే:

AA Credit

Love Cash

GuayabaCash

EasyCredit

Dinner

CrediBus

FlashLoan

LoansCredit

Credit Loans-YumiCash

Go Credit

Instant Loan

large wallet

Fast Credit

Finupp Lending

4S Cash

TrueNaira

EasyCash


Tags:    

Similar News