Moto G04: అడ్వాస్డ్ ఫీచర్స్తో.. 10వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్
కొన్ని బ్రాండ్లకు సెంపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. యూజర్లను దృష్టిలో పెట్టుకుని.. తక్కువ ధర, మంచి స్పెసిఫికేషన్స్ తో ప్రొడక్ట్ ను అందిస్తారు. అలాంటి వాటిలో మోటోరోలా ఒకటి. తాజాగా ఈ బ్రాండ్ నుంచి Moto G04 స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో వచ్చింది. ప్రీమియం డిజైన్, సరసరమైన ధరల్లో, లేటెస్ట్ ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఫిబ్రవరి 15న ఫ్లిప్ కార్ట్ , Motorola.in, ప్రముఖ రిటైల్ స్టోర్లలో తీసుకొచ్చింది. ఈ ఫోన్ లో ఏ విషయంలోనూ రాజీపడలేదు. అత్యాధునిక టెక్నాలజీ, మునుపెన్నడూ లేని విధంగా అత్యుత్తమ కనెక్టివిటీతో ఈ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేశారు.
Moto G04 specifications:
➤ Moto G04 ఫోన్ 6.6 అంగుళాల డిస్ ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది.
➤ UNISOC T606 చిప్ సెట్ , UFS 2.2 స్టోరేజ్ లు ఈ స్మార్ట్ ఫోన్ ను ఫాస్ట్ గా పనిచేసేలా చేస్తాయి.
➤ 5,000mah బ్యాటరీ.. 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 తో ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది.
➤16 ఎంపీ మెయిన్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ 16 ఎంపీ కెమెరా ఇందులో ప్లస్ పాయింట్స్.
➤ ఈ ఫోన్ ధర 4GB RAM+64 GB వేరియంట్ కు రూ.6,249, 8GB RAM+128GB వేరియంట్ కు రూ.7,999గా కంపెనీ నిర్ణయించింది.