50MP కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్.. ధర ఎంతంటే..?
మోటోరోలా నుంచి సరికొత్త ఫీచర్లతో కొత్త ఫోన్ లాంచ్ అయ్యింది. కాలేజ్ స్టూడెంట్స్, యంగ్ కస్టమర్లే లక్ష్యంగా కంపెనీ Moto G84 5G ఫోన్ను తీసుకొచ్చింది. ఆకట్టుకునే కెమెరా సెటప్, ట్రెండీ డిజైన్ వంటి ఫీచర్లతో యువతను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ప్యాంటోన్ కలర్ ఎడిషన్‌తో కంపెనీ జీ సిరీస్ లైనప్‌లో Moto G84 తొలి స్మార్ట్‌ఫోన్.
ఈ మొబైల్ 50MP కెమెరా సెటప్తో వస్తుంది. 12gb ర్యామ్, 256gbతో ఈ ఫోన్ మార్కెట్లో విడుదలయ్యింది. 5000 mah బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ కు 30w ఛార్జింగ్ సపోర్ట్ రానుంది. స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ ప్రాసెసర్‌ను కలిగివున్న ఈ మొబైల్ 13 ఓఎస్పై రన్ అవుతోంది. 6.5 ఇంచెస్ డిస్‌ప్లేతో కస్టమర్ల ముందుకు వచ్చింది.
స్టూడెంట్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్ను 20వేల లోపే కంపెనీ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ధర రూ. 19,999గా కంపెనీగా నిర్ణయించింది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో కస్టమర్లకు ఈ డివైజ్ రూ. 18,999కి లభిస్తుంది. జియోతో కలిసి మోటోరోలా రూ. 5000 వరకూ ఇతర బెనిఫిట్స్ను ఆఫర్ చేస్తుంది.