అంతరిక్షంలో మనకు తెలియని అద్బుతాలెన్నో ఉన్నాయి. అలాంటి వాటిల్లోనే ఒకటి కనుగొన్నారు నాసా శాస్త్రవేత్తలు. ఇప్పుడు దాన్ని పరిశోధించడానికి బయలు దేరుతున్నారు.
స్పేస్....అంతుచిక్కని రహస్యాల గని. అక్కడ ప్రతీదీ ఒక అద్భుతమే మన భూమితో సహా. అందుకే సైంటిస్టులు, అంతరిక్ష పరిశోధనా సంస్థలు ఎప్పుడూ ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటారు. దాంట్లో భాగంగానే ఒక ఉల్కను కనుగొన్నారు. మామూలుగా ఉల్క అంటే సౌరమండంలో ఒక శిథిల పదార్ధం అని చెబుతారు. ఇంకా చెప్పాలంటే గ్రహ శకలాలు. ఇవి నిత్యం ప్రయాణిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడూ భూమి మీదకు పడుతూ ఉంటాయి కూడా. అలా పడిన ఉల్కల వల్లనే భూమిలో మార్పులు జరిగాయని, డైనోసార్స్ అంతరించిపోయాయని చెబుతుంటారు. కానీ ఇప్పుడు అలాంటి ఉల్కే మనకు అంతులేని సంపదను ఇవ్వబోతోందిట. దీనిని కానీ భూమి మీదకు తీసుకురాగలిగితే ఇక్కడ ప్రతీ ఒక్కరూ బిలయనీర్లు అయిపోతారని అంటున్నారు.
సైక్ 16...అంతరిక్షంలో ఇదొక ఉల్క. దీనిని శాస్త్రవేత్తలు 1852లోనే కనుగొన్నారు. అప్పుడే దానికి ఆ పేరు కూడా పెట్టారు. అయితే ఇప్పుడు దాని మీద పరిశోధనలు చేయడానికి వెళుతున్నారు నాసా శాస్త్రవేత్తలు. ఇది భూమి నుంచి చాలా దూరంలో ఉంది. సైక్ కు, భూమికి మధ్య ఉన్న దూరం 300 మిలియన్ మైళ్ళు. ఈ ఉల్క మొత్తం ఇనుము, నికెల్, బంగారాలతో నిండి ఉందిట. దీని మొత్తం విలువ 10 వేల క్విన్టిలియన్ డాలర్లు ఉంటుంది. దీని దగ్గరకు వెళ్ళడం, పరిశోధన చేయడం అంత ఈజీ విషయమేమీ కాదు కూడా.
సైక్ మీద పరిశోధన కోస్ నాసా ఒక స్పెషల్ స్పేస్ షటిల్ ను తయారుచేసింది. అక్టోబర్ లో దీన్ని ప్రయోగిస్తారని సమాచారం. అయితే సైక్ మీద ఉన్న విలువైన లోహాల కోసం ప్రయోగం కాదని నాసా చెబుతోంది. కేవలం గ్రహశకలాలను అర్ధం చేసుకోవడానికి మాత్రమే అని అంటోంది. ఏది ఏమైనా ఇవి సక్సెస్ అయితే మానవుడి చేతిలో ఓ విలువైన ఉల్క ఉన్నట్టే.