ప్రపంచంలోనే తొలి ఫ్లెక్స్‌ ఫ్యూయల్ కారు ఆవిష్కరించిన గడ్కరీ

Byline :  Krishna
Update: 2023-08-30 06:34 GMT

ప్రపంచంలోనే తొలి ఫ్లెక్స్‌ ఫ్యూయల్ కారును కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. పెట్రోల్ మిశ్రమంతో ఇథనాల్ కలిపి ఇంధనంగా ఉపయోగించడమే ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ విధానం. దీనివల్ల కర్బన ఉద్గారాలు తక్కువగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. పెట్రోల్, డీజిల్ కార్ల వినియోగంతో కర్బన ఉద్గారాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో చాలా దేశాలు వాటికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.

ఈ అన్వేషనలో భాగంగానే ఎల‌క్ట్రిక్ ఫ్లెక్స్ ఫ్యుయ‌ల్ పుట్టుకొచ్చింది. టయోటా ఇన్నోవా హైక్రాస్ కారుకు ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీని అమర్చారు. ఇతర ఇంధనాలతో పోలిస్తే ఇథనాల్ తక్కువ ఖర్చుతో లభిస్తుంది. ఎందుకంటే బయోవేస్ట్ నుంచి ఇథనాల్‌ ఉత్పత్తి చేస్తారు. కావున ఇలాంటి వాహనాల వినియోగానికి అయ్యే ఖర్చు.. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే తక్కువగానే ఉంటుంది.

దేశంలో ఇథనాల్‌కు గిరాకీ పెరుగుతుందని.. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ పురోగతికి తోడ్పడుతుందని గడ్కరీ అన్నారు. ఇకపై అన్నదాత ఇంధనదాతగా మారతాడని చెప్పారు. ‘‘ఈ సాంకేతికతను అభివృద్ధి చేసినందుకు టయోటా కిర్లోస్కర్‌ యాజమాన్యానికి ధన్యవాదాలు. దేశంలో కాలుష్యం తగ్గేందుకు కాదు.. వ్యవసాయ రంగంలో ఉద్యోగావకాశాల సృష్టికి ఇది దోహదం చేస్తుంది. ఫ్లెక్స్‌ ఇంజిన్‌లపై మరిన్ని మోడళ్లను తయారు చేయాలని కోరుతున్నాం. మోటార్‌ సైకిళ్లు, ఆటోలు, ఇ-రిక్షాలు, కార్లు 100% ఇథనాల్‌ వాహనాలుగా మారాలని కోరుకుంటున్నా’’ అని గడ్కరీ అన్నారు.



Tags:    

Similar News