వన్ ప్లస్ యూజర్లకు గుడ్ న్యూస్.. 5వేలకే ఫోన్.. వారికి మాత్రమే..
వన్ ప్లస్ బ్రాండ్కు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. దానికి తగినట్లుగానే ఆ కంపెనీ సరికొత్త ఫీచర్లతో ఫోన్లను లాంచ్ చేస్తూ మార్కెట్లో దూసుకెళ్తోంది. అయితే ఇటీవల కాలంలో వన్ ప్లస్ ఫోన్లు కొన్న యూజర్లు ఓ కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. ఉన్నట్టుండి వారి ఫోన్ స్క్రీన్ గ్రీన్ కలర్‌లో మారిపోతుంది.
ముఖ్యంగా వన్‌ప్లస్ 8 ప్రో, వన్‌ప్లస్ 8టీ, వన్‌ప్లస్ 9 ఆర్ ఫోన్స్ కొన్నవారిని ఈ సమస్య బాగా వేధిస్తుంది.
ఈ క్రమంలో కంపెనీపై యూజర్లు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో కంపెనీ దిగొచ్చింది. ఈ ప్రాబ్లం ఉన్నవారికి ఊరట కల్పిస్తూ కీలక ప్రకటన చేసింది. గ్రీన్ స్క్రీన్తో ఇబ్బంది పడే యూజర్లకు జీవితకాల వారంటీని ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రత్యేక వోచర్లను అందిస్తోంది. గ్రీన్ స్క్రీన్ ఉన్న ఫోన్ ఎక్స్చేంజ్ చేసి వన్ ప్లస్ 10r తీసకోవచ్చన్నమాట. అయితే ఇందుకుగాను 5 నుంచి 10వేలు కట్టాల్సి ఉంటుంది.
ప్రస్తుతం వన్ ప్లస్ 10r 35వేలు ఉంది. అయితే కంపెనీ 30వేల వోచర్ ఇవ్వనుండగా.. మిగితా 5వేలు కట్టేస్తే కొత్త ఫోన్ వస్తుంది. ఇది ఇండియాలో ఉండే కస్టమర్లకు మాత్రమే అని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్లతో యూజర్లు ఇబ్బందులు పడడం వల్లే ఈ ఆఫర్ను తీసుకొచ్చినట్లు తెలిపింది. దీన్ని కోసం దగ్గరలోని వన్ ప్లస్ స్టోర్కు వెళ్లాల్సి ఉంటుంది.