ఫోన్‌పే కొత్త వ్యాపారం.. కొనేయ్, అమ్మేయ్..
ప్రముఖ యూపీఐ పేమెంట్ల సంస్థ ఫోన్‌పే కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది. స్టాక్ బ్రోకింగ్ విభాగంలో షేర్.మార్కెట్ పేరుతో కొత్త మొబైల్ యాప్ ప్రారంభించింది. ఈ కొత్త ప్రాజెక్టులో ఆర్థిక సేవలన్నింటిలోనూ ప్రవేశంచినటలయిందని ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగర్ చెప్పారు. షేర్.మార్కెట్‌కు ఉజ్వల్ జైన్ సీఈఓగా ఉంటారు. ప్రస్తుతం షేర్లు, ఈటీఎఫ్‌లతో షేర్.మార్కెట్‌ను ప్రారంభించామని, క్రమంగా ఫ్యూచర్లు, ఆప్షన్లు, ఇతరత్రా విభాగాలను జత చేస్తామని చెప్పారు. ప్లాట్‌ఫామ్ లోగోను బీఎస్‌ఈ మేనేజింగ్ డైరెక్టరు, సీఈఓ సుందరరామన్ రామమూర్తి బుధవారం ఆవిష్కరించారు. ఫోన్‌పే ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులతో ఇ-కామర్స్, బ్యాంకింగ్, బీమా సేవలను అదిస్తోంది. కంపెనీ విస్తరణలో భాగంగా పలు రంగాలపై కన్నేసింది. దేశంలో జరిగే యూపీఐ చెల్లింపుల్లో గూగుల్‌పే, ఫోన్‌పేల వాటా చెరో 43 శాతంగా ఉంది.