Poco M6 Pro 5G : పోకో కొత్త ఫోన్.. 9నిమిషాల్లోనే స్టాక్ ఖతం..

Update: 2023-08-17 05:03 GMT

తక్కువ ధర ఫోన్లకు ఇండియాలో మస్త్ డిమాండ్ ఉంటుంది. మంచి ఫీచర్స్తో 5G ఫోన్ అంటే ఆగుతారా.. ఎగబడి కొంటారు. ఫావోమీ ఇండియా సబ్ బ్రాండ్ అయిన పోకో అతి తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. Poco M6 Pro5G పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్.. అమ్మకాల్లో రికార్డ్ సృష్టించింది. కేవలం 9 నిమిషాల్లోనే ఉన్న స్టాక్ అయిపోయిది.




 


Poco M6 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఆఫర్ ధర కేవలం రూ.9,999 మాత్రమే. చీపెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్‌గా రికార్డ్ సృష్టించిన ఈ ఫోన్‌ తొలి సేల్‌ ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్ట్ 9న జరిగింది. అప్పుడు సేల్ ప్రారంభమైన 15 నిమిషాల్లోనే స్టాక్‌ మొత్తం అమ్ముడుపోయినట్లు కంపెనీ ప్రకటించింది. త్వరలోనే మళ్లీ సేల్ నిర్వహిస్తామని చెప్పిన పోకో ఇండియా రెండో సేల్‌ను ఆగస్ట్ 12న నిర్వహించింది. ఆగస్టు 12 మధ్యాహ్నం 12 గంటలకు Poco M6 Pro 5జీ సేల్ ప్రారంభం కాగా.. 9 నిమిషాల్లోనే స్టాక్‌ అయిపోంది.




 


రెండో సేల్‌కు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చిందని.. 9 నిమిషాల్లోనే ఔట్ ఆఫ్ స్టాక్ అని పోకో ఇండియా హెడ్‌ హిమాన్షు టండన్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో త్వరలోనే మరో సేల్‌ను నిర్వహించే అవకాశం ఉంది.

Poco M6 Pro 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4gb ర్యామ్, 64gb స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999 కాగా.. 6gbర్యామ్, 128gb స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఆఫర్‌ ద్వారా రూ.1000 డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ.9,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్ పవర్ బ్లాక్, ఫారెస్ట్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తోంది.


Tags:    

Similar News