స్మైల్ ప్లీజ్.. విక్రమ్ ల్యాండర్ ఫొటో తీసిన రోవర్...

Byline :  Krishna
Update: 2023-08-30 08:58 GMT

ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగం సాఫీగా సాగుతోంది. జాబిల్లిపై దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞ్యాన్ రోవర్ తమ పనిలో మునిగిపోయాయి. రోవర్ పంపిన డేటాతో చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు ఉన్నట్లు ఇస్రో గుర్తించింది. దీంతోపాటు పలు ఖనిజాలను కనుగొన్న రోవర్.. మాంగనీస్, సిలికాన్, హైడ్రోజన్, అల్యూమినియం, సల్ఫర్, కాల్షియం, ఐరన్, క్రోమియం ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించింది.

ఈ క్రమంలో రోవర్.. ల్యాండర్ను క్లిక్మనిపించింది. రోవర్ తీసిన ఫొటోలను ఇస్రో ట్విట్టర్లో షేర్ చేసింది. స్మైల్ ప్లీజ్ అని రోవర్ అన్నట్లుగా రాసుకొచ్చింది. ఈ రోజు ఉదయం విక్రమ్‌ ల్యాండర్‌ను రోవర్ ఫొటో తీసింది. రోవర్‌కు అమర్చిన నావిగేషన్ కెమెరాలు ఈ ఫొటోలు తీశాయి. నావిగేషన్ కెమెరాలను ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ అభివృద్ధి చేసింది’’ అని ఇస్రో వివరించింది.

Tags:    

Similar News