President of bharat : ప్రెసిడెంట్ ఆఫ్ భారత్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం !!

Byline :  Veerendra Prasad
Update: 2023-09-05 09:12 GMT

G20 సదస్సులో పాల్గొనే నాయకులను సెప్టెంబర్ 9 న విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ఆహ్వాన పత్రిక చర్చనీయాంశంగా మారింది. ఆ ఇన్విటేషన్‌లో President of Indiaకు బదులుగా president of Bharat అని రాసి ఉంది.. భారత్‌ అధ్యక్షతన ఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో ప్రతిష్టాత్మక జీ20 సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి రాష్ట్రపతి భవన్ లో డిన్నర్ ఉంటుందని తెలిపింది. జీ-20 సదస్సు కోసం రూపొందించిన బుక్‌లెట్‌లోనూ ఇండియా అని కాకుండా  ‘భారత్‌’ అని రాశారు. అందులో ‘భారత్‌, మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ’ అని రాసి ఉండటం విశేషం.




 


భారత్‌ అధ్యక్షతన ఈ వారాంతంలో జీ-20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit) జరగనుంది. ఈ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల అధినేతలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే వీరికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సెప్టెంబరు 9వ తేదీన ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇప్పటికే అతిథులకు ఆహ్వానం అందింది. అయితే, ఈ ఆహ్వానంపై President of India అని బదులుగా President of Bharat అని ముద్రించి ఉండటం చర్చనీయాంశమైంది.




 


రాష్ట్రపతి విందు కార్యక్రమ ఆహ్వానంలో దేశం పేరు మార్పును గుర్తించిన కాంగ్రెస్‌ పార్టీ ట్విటర్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ సీనియర్ నేత , ఎంపీ జైరాం రమేష్ ట్విట్టర్ వేదికగా.. ప్రధాని మోదీపై మండిపడ్డారు. మోదీ చరిత్రను వక్రీకరించడం , భారతదేశాన్ని విభజించేందుకు ప్రయత్నించవచ్చు. భారతదేశం అనేది రాష్ట్రాల కలయిక (Union of States Under Assault). ఇది రాష్ట్రాల సమాఖ్యపైనా జరుగుతోన్న దాడి’’ అని కేంద్రంపై ధ్వజమెత్తారు. 'భారత్ ఒడిపోతుంది.. ఇండియా గెలుస్తుంది' అని అన్నారు. కాంగ్రెస్‌ తీరుపై మండిపడ్డారు బీజేపీ అధ్యక్షుడు నడ్డా. దేశ గౌరవానికి సంబంధించిన విషయంపై ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. భారత్‌జోడో యాత్ర చేసిన వాళ్లు భారత్‌ పేరుపై ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు.

Tags:    

Similar News