అదిరే ఫీచర్స్.. కిల్లర్ లుక్స్తో రియల్మీ ఫోన్.. తక్కువ ధరకే..!

Update: 2023-08-22 13:07 GMT

రియల్మీ మిడిల్ ప్రైజ్ సెగ్మెంట్లో కొత్త మొబైల్ను తీసుకువస్తోంది. రక్షాబంధన్ సేల్స్ను దృష్టిలో పెట్టుకుని ‘Realme 11 5G’ స్మార్ట్ ఫోన్ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఫీచర్స్ పరంగా చూసుకుంటే.. 6.72 అంగుళాల HD+ (2400 x 1080 పిక్సెల్‌లు) డిస్‌ప్లే, 120 హెడ్జ్ రీఫ్రెష్ రేట్తో వస్తుంది. 6 నానోమీటర్ డైమెన్సిటీ 6100+ SoC ప్రాసెసర్‌తో లాంచ్ కానుంది. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 13తో వస్తుంది. 8GB RAM + 256GB, 12GB RAM+ 256GB రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

108 ఎంపీ బ్యాక్ కెమెరా, 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇందులో ప్లస్ పాయింట్స్. అంతేకాకుండా 67 వార్ట్స్ సూపర్ వూక్ ఛార్జింగ్ సపోర్ట్తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. ఆ ఫాస్ట్ ఛార్జర్తో ఛార్జింగ్ పెడితే కేవతం 17 నిమిషాల్లో 0 టు 50 ఛార్జ్ అవుతుంది. 47 నిమిషాల్లో పుల్ ఛార్జ్ అవుతంది. ఈ ఫోన్ బేజ్ వేరియంట్ ధర రూ. 20,000 నుంచి మొదలవుతుంది. కాగా, ఆగస్టు 23 నుంచి రియల్మీ స్టోర్స్తో పాటు.. మిగతా ఆన్లైన్ సైట్లలో సేల్కు అందుబాటులో ఉంటుంది.



Tags:    

Similar News