Realme GT 5.. 24GB ర్యామ్తో రియల్ మీ కొత్త ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..?
రియల్ మీ లవర్స్కు గుడ్ న్యూస్.. ఈ కంపెనీ నుంచి త్వరలోనే సరికొత్త ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఏడాది మొదట్లో రిలీజైన Realme GT 3కి అప్డేట్ వెర్షన్గా ఈ ఫోన్ను తీసుకొస్తుంది. ఈ ఫోన్ 24GB ర్యామ్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్కు సంబంధించి కొన్ని వివరాలను కంపెనీ ప్రకటించింది. అయితే లాంచ్ డేట్ను మాత్రం ఇంకా రివీల్ చేయలేదు.
ఈ ఫోన్ 24gb LPDDR5x ర్యామ్తోపాటు 1TB స్టోరేజ్తో వస్తోంది.ఈ ఫోన్ Qualcomm ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8Gen 2 SoC ప్రాసెసర్తో పనిచేయనుంది. 6.74 ఇంచెస్ 1.5K AMOLED డిస్‌ప్లే సహా 144Hz రిఫ్రెష్ రేట్తో ఈ ఫోన్ వస్తోంది. 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో పాటు డిస్‌ప్లే 1,400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కూడా అందిస్తుంది. ఇక ఫొటోల కోసం 50MP Sony IMX890 ప్రైమరీ సెన్సార్‌తో OIS సపోర్ట్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో చాట్ కోసం 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.
రెండు ఫాస్ట్ ఛార్జింగ్ వేరియంట్లలో ఈ ఫోన్ రానుంది. 5200mah బ్యాటరీతో 150W ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు 4600mah బ్యాటరీతో 240w ఫాస్ట్ ఛార్జింగ్ వేరియంట్లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది Realme UI 4.0తో Android 13లో రన్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తుందా అని రియల్ మీ ప్రియులు ఎదురేచూస్తున్నారు.