కళ్లు చెదిరే లుక్స్.. అద్భుత ఫీచర్స్తో రెడ్ మీ నోట్ 13 సిరీస్ వచ్చేసింది

By :  Bharath
Update: 2024-01-04 13:15 GMT

ఇండియన్ మార్కెట్ లో రెడ్ మీ ఫోన్లకు మంచి క్రేజ్ ఉంటుంది. తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్స్ తో అందుబాటులోకి తీసుకొస్తారని చాలామంది ఈ ఫోన్లను కొనడానికి ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా నోట్ సిరీస్ లకు మార్కెట్లోకి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా మరో ఫోన్ ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది షావోమీ (Xiaomi). ఇందులో స్టాండర్డ్ యూనిట్ నోట్ 13 కాగా.. రెడ్ మీ నోట్ 13 ప్రో. రెడ్ మీ నోట్ 13 ప్రో+ పేరిట మరో రెండు ఫోన్లను లాంచ్ చేసింది. చైనాలో ఈ ఫోన్లను ఇదివరకే లాంచ్ చేయగా.. ఇప్పుడు భారత మార్కెట్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. లేటెస్ట్‌ ఫోన్ల ధరలు, స్పెసిఫికేషన్లు వివరాలు ఇప్పుడు చూద్దాం..

నోట్ 13 సిరీస్ వివరాలు:

రెడ్ మీ నోట్ 13 సిరీస్ 6జీబీ+128జీబీ ధర రూ.17,999, 8జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.19,999, 12 జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.21,999గా నిర్ణయించింది.

రెడ్‌మీ నోట్‌ 13 ప్రో 8జీబీ+128 జీబీ వేరియంట్‌ ధర రూ.25,999, 8జీబీ+256 జీబీ రూ.27,999గా, 12 జీబీ+256 జీబీ వేరియంట్‌ ధర రూ.29,999గా కంపెనీ నిర్ణయించింది.

రెడ్‌మీ నోట్‌ 13 ప్రో+ 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.31,999, 12జీబీ+256 జీబీ రూ.33,999, 12జీబీ+512 జీబీ రూ.35,999 తెలిపింది.

నోట్ 13 ఆర్కిటిక్‌ వైట్‌, ప్రిజమ్‌ గోల్డ్‌, స్టెల్త్‌ బ్లాక్‌ కలర్స్ లో.. నోట్ 13 ప్రో ఆర్కిటిక్‌ వైట్, కోరల్‌ పర్పుల్‌, మిడ్‌నైట్‌ బ్లాక్‌ లో.. నోట్ 13 ప్రో+ ఫ్యూజన్‌ బ్లాక్, ఫ్యూజన్‌ పర్పుల్‌, ఫ్యూజన్‌ వైట్‌ కలర్స్ లో లభిస్తుంది.


Redmi Note 13 Specifications


రెడ్ మీ నోట్ 13 వేరియంట్: (Redmi Note 13 Specifications) మీడియాటెక్ డైమెన్ సిటీ 6080 ప్రాసెసర్, 108 ఎంపీ మెయిన్ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సర్, 16 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జ్ తో ఉన్నాయి.


Redmi Note 13 pro Specifications


రెడ్ మీ నోట్ 13 ప్రో వేరియంట్: (Redmi Note 13 pro Specifications) స్నాప్ డ్రాగన్ 7 జనరేషన్ 2 ప్రాసెసర్, 200 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇందులో ప్లస్ పాయింట్స్. 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ మెయిన్ అట్రాక్షన్.

Redmi Note 13 pro+ Specifications

రెడ్ మీ నోట్ 13+ ప్రో వేరియంట్: (Redmi Note 13 pro+ Specifications) స్నాప్ డ్రాగన్ 7 జనరేషన్ 2 ప్రాసెసర్, 200 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇందులో ప్లస్ పాయింట్స్. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ మెయిన్ అట్రాక్షన్.




Tags:    

Similar News