జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కస్టమర్ల కోసం కొత్త ప్లాన్
ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలయన్స్ జియో మరో కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. కస్టమర్ల కోసం లాంగ్ టర్మ్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్ కింద రూ.2,999తో ఏడాది వ్యాలిడిటీతో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రూపొందించింది. ఈ ప్లాన్ లో భాగంగా రూ.5,800 విలువైన కూపన్లను జియో ఇవ్వనుంది.
జియో కొత్త లాంగ్ టర్మ్ ప్లాన్ లో భాగంగా రూ.2999తో రీఛార్జితో 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు రోజుకు 2.5 జీబీ డేటా చొప్పున మొత్తం 912 జీబీ డేటా లభిస్తుంది. జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమాను ఏడాది పాటు ఫ్రీగా చూడొచ్చు. స్విగ్గీ, యాత్ర, అజియో, నెట్ మెడ్స్, రిలయన్స్ డిజిటల్ కొనుగోళ్లపై రూ.5,800 విలువైన కూపన్లను అందిస్తోంది.
ఇక కూపన్ల విషయానికొస్తే స్విగ్గీలో రూ.240 కన్నా ఎక్కువ మొత్తం ఫుడ్ ఆర్డర్ చేస్తే రూ.100 డిస్కౌంట్ లభిస్తుంది. యాత్ర యాప్లో ఫ్లైట్ బుక్ చేసుకుంటే రూ.1500 డిస్కౌంట్, హోటళ్లలో రూ.4,000 వేల కన్నా ఖర్చు చేస్తే 15 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అజియోలో రూ.999 కొనుగోలుపై రూ.200, నెట్‌మెడ్స్ ద్వారా రూ.999 కి కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. రిలయన్స్ డిజిటల్‌లో కొన్ని ఎంపిక చేసిన ఆడియో ఉపకరణాలు, గృహోపకరణాలపై కూపన్లను ఉపయోగించి 10 శాతం తగ్గింపు పొందవచ్చు.