చాట్‌జీపీటీలో ముసలం.. సృష్టికర్తకే ఉద్వాసన..

By :  Krishna
Update: 2023-11-18 16:26 GMT

కృత్రిమ మేధ(ఏఐ)ను సామాన్య యూజర్లకు సైతం అందుబాటులో తీసుకొచ్చిన చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐలో ముసలం మొదలైంది. చాట్‌జీపీటీని ఆవిష్కరించి టెక్‌మాన్ ఆమ్ ఆల్ట్‌మన్‌ను సీఈఓ పదవి నుంచి తప్పించారు. ఆయన వ్యవహార శైలి కంపెనీకి చేటు తెచ్చేలా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు డైరెక్టర్ల బోర్డు తెలిపింది. బోర్డు నిర్ణయం తర్వాత ఓపెన్‌ ఏఐ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు అయిన గ్రెగ్‌ బ్రాక్‌మన్‌ కూడా పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. ఆల్ట్‌మన్ పనితీరు పారదర్శకంగా లేదని, తమ నిర్ణయాలను ఆటంకం కలిగిస్తున్నారని బోర్డు తెలిపింది. ఆల్ట్‌మన్ స్థానంలో కంపెనీ టీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మిరా మురాటీని నియమించారు. ఆమె కూడా చాట్‌జీపీటీ ఆవిష్కరణలు పాలుపంచుకున్నారు.

లాభాపేక్ష లేని సంస్థగా 2015లో ఏర్పాటైన ఓపెన్‌ ఏఐని ఆల్ట్‌మన్ క్రమంగా వ్యాపార సంస్థలా మర్చారు. మైక్రోసాఫ్ట్‌ సహా పాలు బడా ఐటీ కంపెనీలు అతని చొరవతో భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఫలితంగా ఓపెన్ ఏఐ ఆశించిన ప్రయోజనాలు నెరవేరడం లేదనే విమర్శలు వస్తున్నాయి. చాట్‌జీపీటీ సర్వీసు భద్రత గురించి ఆల్ట్‌మన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బోర్డు అంటోంది. యూజర్లు తమంతట తాము సొంత జీపీటీలను డెవలప్‌ చేసుకోవడానికి వీలు కల్పించే కొన్ని ప్లగ్‌ ఇన్‌లను ఆల్టమన్ చొరవతో చాట్‌జీపీటీ తీసుకొచ్చింది. వీటికి బాగా డిమాండ్ రావడంతో ట్రాఫిక్ తట్టుకోలేక చాట్‌జీపీటీ షట్ డౌన్ అయింది. వీటి కోసం సైనప్స్‌ నిలిపేశారు. ఇలాంటి నిర్ణయాలతోపాటు కంపెనీ చీఫ్ సైంటిస్ట్ సుత్‌స్కేవర్‌కు, ఆల్టమన్‌కు మధ్య విభేదాలు ముదిరాయి. సుత్‌స్కేవర్ ఇటీవ ‘సూపర్‌ ఇంటిలిజెంట్’ పేరుతో ఓ కొత్త టీమ్ ఏర్పాట్లు చేసుకోవడంతో ఓపెన్ ఏఐ ఆయన బాధ్యతలకు కత్తెరవేసింది. తనను పదవి నుంచి తప్పించడంపై ఆల్ట్‌మన్ స్పందించారు. తాను ఓపెన్ఏఐ టీమ్ను ఎంతగానో ప్రేమించానని, ప్రపంచానికి ఎంతో కొంత మేలు చేశానని అన్నారు.


Tags:    

Similar News