శాం​సంగ్ నుంచి కొత్త 5g ఫోన్​.. అదిరిపోయే ఫీచర్స్తో​..

Update: 2023-08-08 11:44 GMT

భారత్లో శాంసంగ్ బ్రాండ్కు మస్త్ మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆ కంపెనీ నుంచి ఎప్పుడు కొత్త ఫోన్ వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. తాజాగా శాంసంగ్ అదిరిపోయో ఫీచర్లతో మరో కొత్త 5g ఫోన్ను తీసుకొచ్చింది. శాంసంగ్ గెలాక్సి F34 పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ను సోమవారం మార్కెంట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్.. వన్ ప్లస్ నార్డ్ సిరీస్, రియల్ మీ, ఎంఐ ఫోన్లకు గట్టి పోటీ ఇస్తదని నిపుణులు చెబుతున్నారు.

శాంసంగ్‌ గెలాక్సీ F34 5g స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో ఇండియన్ మార్కెట్లోకి వచ్చింది. 6gb ర్యామ్, 128gb స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999గా ఉండగా.. 8gb ర్యామ్, 128gb స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,999గా ఉంది. ఈ ఫోన్ 6.46 ఇంచెస్ ఫుల్​ హెచ్​డీ అమోలెడ్​ డిస్​ప్లేతో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్ను కలిగివుంది. ఇన్​హౌస్​ ఆక్టా కోర్​ ఎక్సినోస్​ 1280 ప్రాసెసర్తో ఈ ఫోన్ పనిచేయనుంది.




 


ఈ స్మార్ట్‌ఫోన్ ఏకంగా 6000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీ రెండు రోజుల బ్యాకప్‌ అందించగలదని కంపెనీ చెబుతోంది. ఇక ఫొటోల కోసం 50mp కెమెరా, సెల్ఫీల కోసం 13mp ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ డివైజ్‌కు నాలుగు జనరేషన్ల వరకు OS అప్‌డేట్స్, ఐదేళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తామని శామ్‌సంగ్ ప్రకటించింది. అగస్ట్ 11 నుంచి ఈ ఫోన్ సేల్స్ ప్రారంభం కానుండగా.. ఫ్లిప్‌కార్ట్‌, శాంసంగ్‌ వెబ్‌సైట్లలో ప్రీ ఆర్డర్స్ మొదలయ్యాయి.


Tags:    

Similar News