తక్కువ ధరకే సామ్ సంగ్ కొత్త 5జీ ఫోన్..

Update: 2023-07-09 07:50 GMT

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ సామ్ సంగ్ నుంచి మరో కొత్త మొబైల్ మార్కెట్లోకి వచ్చింది. తక్కువ ధరకే 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. సామ్‎సంగ్ గ్యాలక్సీ ఎమ్ 34 పేరుతో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే లాంచ్‌ చేసిన ఈ ఫోన్లను.. ఈ నెల 15 నుంచి ఈ కామర్స్‌ సైట్లలో అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

గ్యాలక్సీ ఎమ్ 34 ఫీచర్లు..

6.6 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ సూపర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే

HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌

ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌

6,000mAh బ్యాటరీ

5nm Exynos 1280 SoC ప్రాసెసర్‌

50 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా

25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్

ధర

సామ్‎సంగ్ గ్యాలక్సీ ఎమ్ 34 5g ఫోన్ బేస్ మోడల్‌కు రూ. 16,999 నుండి ప్రారంభమవుతుంది. ఇది 6GB RAM మరియు 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తోంది. 8GB +128GB స్టోరే‌జ్‌తో వచ్చే ఫోన్ ధర 18,999 గా ఉంది. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్ కలదు.

ఇవి తెలుసుకోండి..

సామ్ సంగ్ గ్యాలక్సీ ఎమ్ 34 5g ఫోన్ డిజైన్ Galaxy F54, Galaxy S23లను పోలి ఉంటుంది. 6,000mAh బ్యాటరీ కారణంగా ఈ ఫోన్ పెద్దగా ఉన్నప్పటికీ పట్టుకోవడానికి ఇబ్బంది అనిపించదు. ఫింగర్‌ప్రింట్ సెన్సార్ పవర్ బటన్‌లో అమర్చారు.హెడ్‌ఫోన్ జాక్‌ కూడా ఈ ఫోక్ నుంచి పొందే మరో సౌకర్యం. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే బ్యాటరీ రెండు రోజులు పూర్తి స్థాయిలో ఉంటుంది.



Tags:    

Similar News