SBI YONO యాప్‌ ఇక అందరికీ.. SBIలో అకౌంట్ లేకపోయినా వాడుకోవచ్చు

Update: 2023-07-14 16:08 GMT

డిజిటల్ చెల్లింపుల్లో గుత్తాధిపత్యాన్ని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోకి ఎస్‌బీఐ రంగంలోకి దిగింది. ఇతవరకు తన ఖాతాదారులకే పరిమితమైన యోనో మొబైల్‌ యాప్‌ను ఇక అందరికీ వినియోగంలోకి తీసుకొచ్చింది. ఎస్‌బీఐలో బ్యాంకు ఖాతా లేకపోయినా దీన్ని డిజిటల్ లావాదేవీలకు వాడుకోవచ్చు. ఫోన్ పే, గూగుల్ పే యాప్‌లలో మాదిరి చెల్లింపులు, నగదు బదిలీలు చేసుకోవచ్చు. బ్యాంకింగ్‌ యాప్‌ సేవలను ప్రజందరికీ చేరువ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని బ్యాంకు తెలిసింది.

ఇతర పేమెంట్ల యాప్‌లా మాదిరే తమ యోనో కూడా సురక్షితని, స్కాన్‌ అండ్‌ పే, పే బై కాంటాక్ట్స్‌, రిక్వెస్ట్‌ మనీ వంటి సేవలను ఇందులో పొందొచ్చని వివరించింది. పేమెంట్లతోపాటు కార్డ్‌ లెస్‌ క్యాష్‌ విత్‌డ్రాయల్‌ సౌకర్యం కూడా యోనో యాప్‌లో ఉంది. ఐసీసీడబ్ల్యూ (Interoperable Card-less Cash Withdrawal) సదుపాయం ఉన్న ఏటీఎంలలో కస్టమర్లు యోనోలోని ‘యూపీఐ క్యూఆర్‌ క్యాష్‌’ ఆప్షన్‌ కార్డు లేకుండానే నగదు తీసుకోవచ్చు. యోనో యాప్‌ను గూగల్ పే, ఫోన్ పే లాగే ప్లే స్టోర్ నుంచి లౌడ్‌లోడ్ చేసుకుని వాడుకోవాలి. ఫోన్ నంబరు ఏదో ఒక బ్యాంకు ఖాతాతో లింకై ఉండాలి. రిజిస్టర్ చేసుకుని, ఆరు నంబర్ల పిన్ సెట్ చేసుకుని వాడుకోవాలి. యోనో యాప్ యూనివర్సల్ యాప్ కావడంతో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంలకు గట్టి పోటీ ఇవ్వనుంది. అయితే ఎస్బీసే డిజిటల్ సేవల్లో తరచూ అంతరాయాలు వస్తుండడం వల్ల యూజర్లు దీన్ని ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.


Tags:    

Similar News