Amazon Great Republic day Sales: 15 వేలలోపు స్మార్ట్ఫోన్ చూస్తున్నారా..! అమెజాన్ సేల్స్లో వీటిపై ఓ లుక్కేయండి

By :  Bharath
Update: 2024-01-13 15:10 GMT

తక్కువ ధరలో.. మంచి ఫీచర్స్ తో ఉండే స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా..! అయితే రూ.15 వేలలోపు అద్భుతమైన ఫీచర్స్ తో కొన్ని ఫోన్లు మీముందుకు. రిపబ్లిక్ డేని పురస్కరించుకుని అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ను తీసుకొచ్చింది. జనవరి 13 నుంచి ప్రారంభమైన ఈ సేల్స్ లో.. అన్ని రకాల ప్రొడక్ట్స్ పై ఆఫర్స్ ఉన్నాయి. అయితే చాలామంది రూ.15 వేలలోపు స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తుంటారు. అలాంటివారి కోసం ఈ సేల్ బాగా ఉపయోగపడుతుంది. ఈ లిస్ట్ లో ఏ ఫోన్లు అందుబాటులో ఉన్నాయో ఒకసారి చూద్దాం..

iQOO Z7s 5G:

FHD+ AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ (695 5G ప్రాసెసర్) ప్రాసెసర్ కోసం చూస్తున్నట్లైతే ఈ ఫోన్ పై ఓ లుక్కేయొచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ.23,999 ఉంగా.. ఆఫర్ లో రూ.14,999కే లభిస్తుంది. 64 ఎంపీ మెయిన్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇందులో ప్లస్ పాయింట్. 44W ఫాస్ట్ చార్జింగ్‌తో 4500mAh బ్యాటరీ వస్తుంది.

Realme Narzo 60X 5G:

FHD+ IPS LCD డిస్‌ప్లే, MediaTek డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌, 50MP +2MP మెయిన్ కెమెరా, 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఈ ఫోన్ లో మెయిన్ హైలైట్. 33 వాట్ ఫాస్ట్ చార్జ్, 5000mAh బ్యాటరీ వస్తుంది. దీని ధర రూ.17,999 కాగా.. రూ.12,999కే సేల్స్ లో వస్తుంది.

iQOO Z6 Lite 5G:

రూ.19,999 ఉన్న ఈ స్మార్ట్ ఫోన్.. రూ.12,999కే సేల్స్ లో లభిస్తుంది. 120Hz IPS LCD డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్‌ ఉన్నాయి. 50MP+2MP మెయిన్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 18 వాట్ ఫాస్ట్ చార్జ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

Redmi 12 5G


: FHD+ డిస్‌ప్లే, Snapdragon 4 Gen 2 ప్రాసెసర్ తో వస్తున్న ఈ ఫోన్ ధర ఆఫర్ లో రూ.12,999గా ఉంది. కానీ అసలు ధర రూ.17,999. 50MP మెయిన్ కెమెరా, ఫ్రంట్ సెల్ఫీల కోసం 8MP కెమెరా ఉంది. 22.5W ఫాస్ట్ చార్జింగ్‌తో 5000mAh బ్యాటరీతో వస్తుంది.



Tags:    

Similar News