వామ్మో.. ప్రపంచంలో సోషల్ మీడియా వాడేవాళ్లు ఇంతమందా..?

Update: 2023-07-21 11:26 GMT

ప్రతీ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్.. అందులో ఇంటర్నెట్.. ఈ రోజుల్లో ఏ ఇంట్లో చూసినా ఇది కామన్ అయిపోయింది. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ తో పాటు.. సోషల్ మీడియా టెక్నాలజీలో మార్పు తీసుకొచ్చింది. ప్రతీ ఒక్కరిని కనెక్ట్ అయి ఉండేలా చేసింది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో ఏకంగా 60శాతానికి పైగా ప్రజలు సోషల్ మీడియాకు వినియోగిస్తున్నారని ఓ స్టడీలో తేలింది. తాజాగా విడుదలైన లెక్కల ప్రకారం.. ప్రపంచ జనాభా 800 కోట్లు దాటగా.. జులై నాటికి సోషల్ మీడియా వాడుతున్న వాళ్లు 500 కోట్ల వరకు ఉన్నారు. అంతేకాకుండా వాళ్లంతా యాక్టివ్ యూజర్లు కావడం గమనార్హం. పోయిన ఏడాదితో పోల్చితే సోషల్ మీడియా వాడుతున్న వాళ్ల సంఖ్య 3.7 శాతం పెరిగింది.

కెపియోస్‌ అనే డిజిటల్‌ అడ్వైజరీ సంస్థ ఈ స్టడీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ 10 మంది ఇంటర్నెట్ యూజర్లలో 9మంది సోషల్ మీడియా వాడుతున్నారు. ప్రతీ సెకన్ కు 5.5 మంది కొత్తగా సోషల్ మీడియాలో చేరుతున్నారు. అలా గడిచిన ఏడాదిలో కొత్తగా 17.3 కోట్ల మంది కొత్తగా చేరారు. అయితే.. తూర్పు, మధ్య ఆఫ్రికాలో ప్రతి 11 మందిలో కేవలం ఒకరు మాత్రమే సోషల్ మీడియా వాడుతున్నారు. భారత్ లో ప్రతి ముగ్గురిలో ఒకరు వాడుతున్నారు. ఒక్కో యూజర్ రోజులో 2.26 గంటలు మొబైల్ లోనే ఉంటున్నాడు.

The number of people using social media worldwide is 500 crores

world population, world social media users, study, Capios, digital advisory firm, latest news, viral news, telugu news, how many users use social media on use

Tags:    

Similar News