జాబిల్లిపై ల్యాండర్ అడుగుపెట్టే చారిత్రక క్షణాల కోసం యావత్ ప్రపంచం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావాలని దేశమంతా సర్వమత ప్రార్ధనలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో సాధువులు యాగం చేపట్టారు.
చంద్రయాన్ మిషన్ విజయవంతం కావాలని హోమం నిర్వహించారు. అటు.. వారణాసిలోనూ చంద్రయాన్-3 సక్సెస్ కావాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ యాగంలో సాధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విక్రం ల్యాండర్ చంద్రుడిపై సేఫ్‌గా ల్యాండ్ కావాలని లక్నోలోని మసీదులో ముస్లింలు కూడా నమాజ్ చేశారు.
ఉత్తరాఖండ్‌లోని రిషీకేష్‌లో చంద్రయాన్-3 సక్సెస్‌ను కాంక్షిస్తూ త్రివర్ణ పతాకాలు చేబూని గంగా నదికి హారతి ఇచ్చారు.
చంద్రయాన్ సక్సెస్‌తో ఇస్రో ఘనకీర్తి ప్రపంచం నలుదిశలా చాటాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఒడిషా సముద్ర తీరంలో ప్రముఖ సైకత శిల్పకారుడు సుదర్శన్ పట్నాయక్ విక్రం ల్యాండర్ చంద్రుడిపై సేఫ్‌గా ల్యాండ్ కావాలని ఇసుకతో సైకత శిల్పం ఏర్పాటు చేశారు.
మరోవైపు చంద్రయాన్-3 మిషన్ సేఫ్ ల్యాండింగ్‌ను విద్యార్ధులు వీక్షించేందుకు పాఠశాలలు, విద్యాసంస్ధల్లో లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, బుధవారం సాయంత్రం 5.45 గంటల తర్వాత చంద్రునిపై సురక్షితమైన ల్యాండింగ్ చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ మేరకు సూర్యుడి వెలుగు రాగానే సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.