ఆత్మహత్యలకు చెక్ పెట్టేందుకు సీలింగ్ ఫ్యాన్లు.. సొల్యూషన్ ఇదేనట!!

Update: 2023-08-18 08:08 GMT

ఏదైనా సమస్యకు సరైన పరిష్కారం కనుక్కుంటేనే అది మళ్లీ పునరావృతం కాదు. అలా కాకుండా.. గుండెపోటుకి తలపోటు మందు ఇచ్చినట్లు.. ఆత్మహత్యల నివారణకు సీలింగ్ ఫ్యాన్లను మార్చేయడం లాజిక్‌లెస్ గా ఉంది. చదువు ఒత్తిడి, ఉద్యోగం రాలేదన్న నిరాశ, నిస్పృహలతో ఈ మధ్య రాజస్థాన్​లోని కోటాలో విద్యార్థులు ఫ్యాన్​లకి ఉరేసుకుని చనిపోతున్నారు. దీంతో అప్రమత్తమైన స్థానిక యంత్రాంగం ఆత్మహత్యల నివారణకు ఓ మహత్తరమైన చర్యలకు పూనుకుంది. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుం... డాకోటాలోని అన్ని హాస్టళ్లు, పెయింగ్ గెస్ట్‌ (పీజీ) వసతుల్లో స్ప్రింగ్‌ లోడెడ్‌ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని జిల్లా మేజిస్ట్రేట్‌ ఆదేశించారు. ఇక సిబ్బంది కూడా ఆ ఆదేశాలను పాటించి.. ఫ్యాన్లను బిగించారు. ఒకవేళ ఎవరైనా సూసైడ్​ చేసుకోవాలని చూసిన వారి బరువుకు ఫ్యాన్​ ఊడి కిందకి వస్తుంది. దీంతో ఆత్మహత్యలు ఆపినట్లేనని వారి భావన.

ఆత్మహత్యలు జరగకుండా స్ప్రింగ్​ఫ్యాన్లు ఏర్పాటు చేయడంపై రాజస్థాన్​ ఆఫీసర్లపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూసైడ్​లు జరగకుండా కౌన్సిలింగ్​ఇచ్చి ఆపాల్సింది పోయి స్ప్రింగ్​లు బిగించడమేంటని ప్రశ్నిస్తున్నారు. వేరే విధంగా చనిపోతే దానికి కూడా ఇలాంటి పనికి మాలిన ఐడియాతో పరిష్కారం చూపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తమకు నచ్చిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు.

కోటా లో ఐఐటీ, జేఈఈ, నీట్‌ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది విద్యార్థులు ట్రైనింగ్ తీసుకుంటారు. ఈ ఏడాది దాదాపు 2.5లక్షల మంది అక్కడ శిక్షణ తీసుకుంటున్నట్లు అంచనా. ఏడాది ఇప్పటికే 20 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. గత ఎనిమిదేళ్లతో పోలిస్తే ఈ ఏడాది కోటాలో ఆత్మహత్యల సంఖ్య చాలా ఎక్కువ.



Tags:    

Similar News