వినియోగదారులకు టాటా మోటార్స్ షాకిచ్చింది. కొత్త ఏడాది నుంచి ధరల్ని పెంచుతున్నట్లు పలు వాహన తయారీ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. అదే బాటలో టాటా మోటార్స్ కూడా నడుస్తుంది. వచ్చే ఏడాది నుంచి తమ వాహనాల ధరలు కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు జనవరి 1, 2024 నుంచి అమల్లోకి రానున్నాయి. మోడల్ ను బట్టి ధర మూడు శాతం పెరగనుంది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా, ఆడి కంపెనీలు తమ ప్రయాణికుల వాహనాల ధరలను జనవరి నుంచి పెంచుతామని ప్రకటించిన విషయం తెలిసిందే.