Tecno Pop 8: తక్కువ ధర, ప్రీమియం ఫీచర్స్.. అదిరిపోయే లుక్స్తో టెక్నో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్

By :  Bharath
Update: 2024-01-04 10:59 GMT

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో పాప్ 8.. మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. తక్కువ ధర, ప్రీమియం ఫీచర్స్.. అదిరిపోయే లుక్స్తో ఈ ఫోన్ ను తీసుకొచ్చింది. ఆక్టాకోర్ చిప్ సెట్, 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో, ఫ్రంట్ డ్యుయల్ ఫ్లాష్ యూనిట్ తో వస్తుంది. కాగా ఈ ఫోన్ రెండు కలర్స్ లో అందుబాటులోకి వస్తుంది. గ్రావిటీ బ్లాక్, మిస్టరీ వైట్ ఆప్షన్స్ లభిస్తుంది. 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ తో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ.6,499 గా ఉండగా.. ఆఫర్ కింద రూ.5,999కి ఇస్తున్నారు. ఐఫోన్ లో ఉండే డైనమిక్ ఐలాండ్ ఫీచర్ ఇందులో స్పెషల్ అట్రాక్షన్.

ఇతర స్పెసిఫికేషన్లు:

హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల హెచ్‌డీ + డిస్ప్లే

యూనిసోక్ టీ 606 ఎస్వోసీ చిప్ సెట్

ఆండ్రాయిడ్ 13 గో ఎడిష‌న్ బేస్డ్ హెచ్ఐఓఎస్

12 మెగా పిక్సెల్ డ్యూయల్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా

స్టీరియో స్పోకర్స్



Tags:    

Similar News