Chandrayaan-3: సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు సహకరించేవి ఇవే
యావత్ భారతదేశం గర్వించే క్షణాలు ఆసన్నమయ్యాయి. మరికొద్ది గంటల్లో ఆవిష్కృతమయ్యే అద్భుత ఘట్టం కోసం ప్రపంచం ఎదురుచూస్తుంది. మన చంద్రయాన్-3 రోవర్ జాబిల్లిపై కాలు మోపే అపురూప దృశ్యాలను లైవ్ లో చూడటం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎలాంటి ఆటంకం లేకుండా మిషన్ సక్సెస్ కావాలని పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రయాన్-3 తన సొంతంగా చంద్రుడిపై ల్యాండ్ అవుతుందని ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. అయితే చంద్రయాన్-3 చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు సహకరించే వాటి గురించి..
డాప్టర్ వెలోసీమీటర్స్ (ఎల్డివి)- ల్యాండింగ్ కు ముందు చంద్రయాన్-3 వేగాన్ని నియంత్రిస్తాయి
అల్టీమీటర్స్- చంద్రయాన్-3 ల్యాండర్ ఎత్తును నియంత్రిస్తాయి
ఇనర్షియల్ మెజర్మెంట్- ఇది నావిగేషన్, నియంత్రణలో సహకరిస్తుంది. ఇనర్షియాను లెక్కిస్తుంది.
ప్రొపల్షన్ సిస్టమ్- చంద్రుడిపై ఉపరితల ఎత్తును బట్టి ల్యాండర్ వేగాన్ని నియంత్రిస్తుంది. అంతేకాకుండా నేవిగేషన్, గైడెన్స్, కంట్రోల్ ల్యాండింగ్ మార్గాన్ని నిర్దేశిస్తుంది.
కంట్రోల్ ఎలక్ట్రానిక్స్- వివిధ సిస్టమ్‌లు, భాగాలను మేనేజ్, రెగ్యులేట్ చేస్తుంది. స్మూత్ ఆపరేషన్స్, కోఆర్డినేటెడ్ ఫంక్షనాలిటీని నిర్ధారించి, ల్యాండింగ్ మార్గాన్ని నిర్దేశిస్తుంది.
హజార్డియస్ డిటెక్షన్ &అవాయిడెన్స్ - ప్రమాదాన్ని గుర్తించడానికి, నివారించడానికి ల్యాండర్ మాడ్యూల్ లో కెమెరా, ప్రాసెసింగ్ అల్గారిథం ఉంటాయి.
ల్యాండింగ్ లెగ్ మెకానిజం- ఇది స్థిరమైన వేగంతో ల్యాండింగ్ అవడానికి సాయపడుతుంది.