Pslv-c58 : డేంజర్ జోన్‌లో చంద్రుడు..భారీ ప్రకంపనలతో గుంతలమయం

Update: 2024-01-29 02:56 GMT

చంద్రునిపై ప్రయోగాలు చేపట్టేందుకు శాస్త్రవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ వరుసలో ముందుగా నాసా ఉంది. ఈ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఇప్పటికే చంద్రునిపై అనేక ప్రయోగాలను చేపట్టింది. చంద్రుడిపై వ్యోమగాములను పంపేందుకు ఆర్టెమిస్-3 మిషన్‌ను నాసా 2026 ప్రయోగిస్తామని వెల్లడించింది. గతంలో 1972లో నాసా అపోలో 17 మిషన్‌ను ప్రయోగించింది. ఈ మిషన్ ద్వారానే ఇప్పుడు జాబిల్లిపైకి మనుషులను పంపనుంది. అయితే ప్లానెటరీ సైన్స్ జర్నల్‌లో ఓ అధ్యయనం ప్రచురితమైంది. ఆ జర్నల్ ఇప్పుడు నాసాకు సవాల్‌గా మారింది.

చంద్రుని దక్షిణ ధ్రువంపై భారీ ప్రకంపనలు సంభవించాయి. దీంతో పూర్తిగా గుంతలమయంగా తయారైందని పరిశోధకులు తేల్చి చెప్పారు. చంద్రుడిపై ప్రకంపనల వల్ల కొండచరియలు విరిగిపడుతున్నాయని, అక్కడ చాలా భాగం వ్యోమగాముల సేఫ్ ల్యాండింగ్‌కు అనుకూలంగా లేదని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. రోజురోజుకూ చంద్రుడు కుంచించుకుపోవడం వల్ల ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరించారు.

ఇకపోతే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన ఇస్రో ఈ నెల 1వ తేదిన PSLV -C58 ద్వారా XPOSAT ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ శాటిలైట్‌కు సంబంధించి ఇస్రో కీలక విషయాన్ని వెల్లడించింది. XPOSAT ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు తెలిపింది. దీంతో ఇస్రో ఖాతాలోకి మరో విజయం చేరిందని, ఈ మిషన్ రాబోయే 75 రోజుల్లో భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని ఇస్రో వెల్లడించింది. ఇది అంతరిక్షంలో ఎలాంటి శిథిలాలను వదిలి వేయకుండా తిరిగి భూ వాతావరణంలోకి చేరుతుందని ఇస్రో తెలిపింది.


Tags:    

Similar News