Relationship Break : నువ్వు నాకు బోర్‌ కొట్టేశావు.. ఇదే నేటి రిలేషన్‌షిప్‌

Update: 2024-01-02 07:06 GMT

ఉదయం లేచింది చాలు పరుగులే..పరుగులే.. ఇంటి పనులు, ఆఫీస్‌ పనులు ఇలా రోజంతా బిజీనే. వృత్తి పరమైన జీవితానికి కేటాయిస్తున్న సమయంలో కనీస సమయాన్ని కూడా వ్యక్తిగత జీవితానికి కేటాయించడం లేదు. ఈతరం దంపతులలో ఇది

మరి ఎక్కువ. దీంతో కపూల్స్ మధ్య దూరం పెరుగుతుంది. ఆ దూరం కాస్తా విడాకుల వరకు వెళుతుంది. కలిసి నిండూ నూరేళ్లు సాగించాల్సిన కాపురం చివరకు కలహాలతో కకావికలం అవుతుంది. వివాహా బంధం పవిత్రమైంది.

చాలా మంది నవ దంపుతులకు దీని విలువ తెలియదు. సంపాదన మోజు. పాశ్చాత్య పోకడలు, వివాహేతర సంబందాలతో బంధాన్ని ముక్కలయ్యేలా చేసుకుంటున్నారు. పెళ్లైనా కొద్ది నెలలకే భార్యాభర్తలు విడాకులకు వరకు వెళుతున్నారు.

సింపుల్‌గా "నువ్వు నాకు బోర్‌ కొట్టేసావు" చెప్పేస్తున్నారు. నిజానికి మన వివాహ బంధం ఒక్క మాటతో తెగిపోయేదా.. ఇద్దరు మానుషులను కలపాలంటే ఎన్ని మాటలు, ఎన్ని సంప్రదింపులు.. చివరకు వేద మంత్రోచ్ఛారణ నడుమ ఎన్ని చేతులతో దీవిస్తే ఆ బంధం ఏర్పడుతుంది. అలాంటి బంధాన్ని చిన్నపాటి పొరపొచ్చాలతో దూరం చేసుకుంటున్నారు

బంధం బలపడాలంటే

దంపతులిద్దరూ వారికంటూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ఒకరి కోరికలను, లక్ష్యాలను మరొకరు అర్థం చేసుకుంటూ ఒకరికొకరు మద్దతు తెలుపుకుంటూ ముందుకు సాగాలి. మాటలే కాదు భౌతికంగానూ కపుల్స్ దగ్గరవ్వాలి. రొమాన్స్‌, శృంగారం అనుబంధాన్ని బలపడంలో కీలకపాత్ర పోషిస్తాయి. చాలా మంది పిల్లల తాము సమయం కేటాయించలేకపోతున్నాం అంటారు. ఆలుమగల జీవితంలో పిల్లలు కూడా అంతర్భాగమే! పిల్లలకు జన్మనివ్వడంలో భార్యాభర్తలు ఏ బాధ్యతతో మెలుగుతారో.. పిల్లల్ని బాధ్యతలను నెరవేర్చడంలో కూడా అదే విధంగా ఉండాలి. ఇక ఈ దొరికిన సమయాన్ని దంపతులిద్దరూ కేటాయించుకోవాలి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటే ఆ సంసారంలో కలతలకు చోటే ఉండదు..

Tags:    

Similar News