WhatsApp Features : వాట్సాప్లో కొత్త ఫీచర్.. మీరే స్టిక్కర్ను ఎడిట్ చేసుకునే ఛాన్స్

Byline :  saichand
Update: 2024-01-12 08:39 GMT

మెటా యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్లో త్వరలో మరో కీలక ఫీచర్కు అందుబాటులోకి రానుంది. వాట్సాప్లో ఈ ఫీచర్ను ప్రవేశపెట్టిన తర్వాత, యూజర్స్ వాట్సాప్ యాప్లో స్వయంగా స్టిక్కర్లను రూపొందించుకోవచ్చు. అలాగే యూజర్లు స్టిక్కర్లను ఎడిట్ చేసి డిజైన్ చేసుకోవచ్చని సంస్థ తాజా నివేదికలో వివరించింది

ఈ కొత్త అప్డేట్ అందుబాటులోకి వస్తే వినియోగదారులకు స్టిక్కర్ల కోసం థర్డ్ పార్టీ యాప్ ఉపయోగించాల్పిన అవసరం లేదని WaBetaInfo నివేదిక , తెలిపింది. ప్రస్తుతం కొత్త ఫీచర్ను WhatsApp iOS బీటా వెర్షన్ 24.1.10.72లో పరీక్షిస్తున్నట్లు వెల్లడించింది.

WhatsApp కస్టమ్ స్టిక్కర్ ఫీచర్ ఏమిటి? 

వాట్సాప్లో చాలా కాలంగా స్టిక్కర్ల సపొర్ట్ చేస్తూ వస్తుంది. స్టిక్కర్ల సహాయంతో, యూజర్స్ తమ చాటింగ్ను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. ఇనాళ్ళు స్టిక్కర్ల కోసం థర్డ్ పార్టీ యాప్లపై ఆధారపడవలసి వచ్చింది. ఈ ఫీచర్కు అందుబాటుకి యూజర్స్ వారి ఎంపికకు అనుగుణంగా స్టిక్కర్లను రూపొందించుకోవచ్చు. దీని కోసం యాప్లోనే 'ఎడిట్ స్టిక్కర్' బటన్ అందుబాటులో ఉంటుంది.

Tags:    

Similar News