whatsapp business :వాట్సాప్ కొత్త రూల్.. మెసేజ్ పంపాలంటే డబ్బులు కట్టాల్సిందే!
whatsapp business update వాట్సాప్ ప్రపంచ వ్యాప్తంగా చాలామంది దినచర్యలో భాగం అయింది. ప్రపంచంలో అత్యధికంగా వినియోగిస్తున్న ఇన్ స్టంట్ మల్టీ మెసేజింగ్ యాప్ కూడా వాట్సాప్. దాదాపు రెండు బిలియన్లకు పైగా జనాలు వాట్సాప్ వాడుతున్నారు. 2019లో మెటా సంస్థ వాట్సాప్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి కీలక మార్పులు తీసుకొస్తుంది. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో యాడ్స్ ద్వారా భారీగా ఆదాయాన్ని అర్జిస్తుంది వాట్సాప్. ఇకపై వాట్సాప్ ద్వారా కూడా ఆదాయాన్ని పొందే ఆలోచన చేస్తోంది. భారత్, బ్రెజిల్ లోని బిజినెస్ వాట్సాప్ లో పెయిడ్ సర్వీసులు తీసుకొచ్చే ఆలోచనలో పడింది. దీంతో వాట్సాప్ యూజర్లు బిజినెస్ యూజర్లు యాప్ ద్వారా చాట్ చేస్తే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కస్టమర్లతో చాట్ చేసేందుకు గాను ఒక్కో మెసేజ్ కు 40పైసల వరకు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది.