Whatsapp New Feature : గ్రూప్ చాటింగ్ కోసమే..! వాట్సాప్ కొత్త అప్డేట్

By :  Kalyan
Update: 2023-12-13 10:05 GMT

వాట్సాప్ గ్రూప్ చాటింగ్స్ అంటేనే ఓ గందరగోళం. పదుల సంఖ్యలో ఉండే గ్రూప్ మెంబర్స్.. వారి చాటింగ్ తో ఇన్ బాక్స్ నిండిపోతుంది. అలాంటి సందర్భాల్లో గ్రూప్ లో దేనిపై చర్చ జరుగుతుందో తెలుసుకోవడం కాస్త కష్టం. పైకి స్క్రోల్ చేస్తూ వెళ్తేగానీ.. చాటింగ్ లో జరుగుతున్న అసలు విషయం ఏంటో తెలియదు. అలాంటి టైంలో కొన్ని ముఖ్యమైన అప్ డేట్స్ ను మిస్ అవుతుంటారు. అలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు వాట్సాప్ కొత్త అప్ డేట్ ‘పిన్ చాట్ ఫీచర్’ను తీసుకొచ్చింది. వ్యక్తిగత చాటింగ్, గ్రూప్ సంభాషణలను మిస్ కాకుండా ఉండేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. కాగా ఈ ఫీచర్ ను గ్రూప్ అడ్మిన్ వినియోగించుకోవచ్చు. కేవలం టెక్స్ట్ మెసేజ్ లే కాకుండా.. వాట్సాప్ పోల్స్, ఫోటోలు, ఇమోజీలు ఇలాంటివి పిన్ చేసుకోవచ్చు. అలా పిన్ చేసిన ప్రతీ మెసేజ్ వాట్సాప్ చాట్ లో పై భాగంలో కనిపిస్తుంది.

టెలిగ్రామ్ లో ఇప్పటికే ఉన్న ఈ ఫీచర్ ను.. వాట్సాప్ లో కూడా దర్శనం ఇవ్వబోతుంది. గ్రూపుల్లో పిన్ చేసిన మెసేజ్ లు 7 రోజులు ఢీఫాల్ట్ గా ఉంటాయి. కావాలనుకుంటే.. 24 గంటలు, నెల రోజులు ఉండేలా కూడా సెట్ చేసుకోవచ్చు. టైం లిమిట్ అయిపోగానే పిన్ చేసిన మెసేజ్ అన్ పిన్ అవుతుంది. చాట్ లోని ఏదైనా మెసేజ్ ను లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోగానే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులోని పిన్ మెసేజ్ ఆప్షన్ ను క్లిక్ చేసి ఈ ఫీచర్ ను వినియోగించుకోవచ్చు. మెసేజ్ ను పిన్ చేసినట్లే.. అన్ పిన్ కూడా చేయొచ్చు. ఈ ఫీచర్‌ను మొబైల్‌, డెస్క్‌టాప్‌ యూజర్లు కూడా వినియోగించుకోవచ్చు.

WhatsApp has brought the Pin chat feature

WhatsApp,WhatsApp new update,WhatsApp new feature,WhatsApp pin messge,Pin chat feature,business news,tech news

Tags:    

Similar News