LED: అతిపెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్ రెడీ.. ఖర్చు16,00,00,00,000

Update: 2023-10-01 05:43 GMT

వెండి తెరల్లో ఎన్నో విశేషాలు చూశాం. ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ తెరల్లోనూ రోజురోజుకై హైఎండ్ టెక్నాలజీతో అద్భుతాలను ఆవిష్కరిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. గోళాకారంలో రూ. 16వేల కోట్లకుపైగా వ్యయంతో నిర్మించిన ఈ తెరను లాంఛనంగా ప్రారంభించారు.

అమెరికాలోని లాస్‌ వెగాస్‌ నగరంలో ఈ డిజిటల్ కాంతుల గోళాన్ని ఏర్పాటు చేశారు. 2018లో వెనీషియన్ రిస్టార్టులో యూ2 పేరుతో ఈ స్క్రీన్ నిర్మాణం మొదలైంది. దీని ఎత్తు 366 అడుగులు, వెడల్పు 516 అడుగులు. హైరిజల్యూన్ ఫీచర్ ఉన్న ఈ తెరముందు 17,500 మంది కూర్చుని ప్రదర్శన తిలకించవచ్చు. మిలియన్లకొద్దీ ఎల్‌ఈడీ లైట్లను జోడించి ఈ తెరను రూపొందించారు. అమెరికా వ్యాపారవేత్త జేమ్స్‌ డోలన్‌ దీన్ని నిర్మించాడు. బయటి భాగంపై రంగురంగుల చిత్రాలను ప్రొజెక్ట్ చేస్తున్నారు. లోపలి స్క్రీన్ కళ్లు తిరిగిపోయేలా ఉంటుందని, మరో గ్రహగోళంలోకి అడుగుపెట్టినట్లు ఉంటుందని నిర్వాహకులు చెప్పారు. గత శుక్రవారం ఐరిష్‌ రాక్‌ బ్యాండ్‌ ప్రదర్శనతో ఈ తెరను ప్రారంభించారు.

Tags:    

Similar News