Redmi 13C 5G: రూ.10 వేల లోపే 5జీ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ ఇవే

Byline :  Veerendra Prasad
Update: 2023-12-07 03:45 GMT

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ రెడ్ మీ.. తమ సరికొత్త బడ్జెట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. Redmi 13C 5G స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్ లోకి విడుదల చేసింది. తక్కువ ధరలో మంచి ఫీచర్స్ కలిగిన ఫోన్ కొనాలనుకునే వారికి ఈ 5జీ స్మార్ట్ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ పవర్ ఫుల్ మీడియా టెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్ తో అందుబాటులో ఉంటుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. మరొకవైపు ఈ స్మార్ట్ ఫోన్ 50 మెగా పిక్సెల్ ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) కెమెరాను కలిగి ఉంటుందని, అలాగే ఇది 90 హెడ్జ్ రిఫ్రెష్ రేటును కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అయిన అమెజాన్ లో కూడా అమ్మకానికి అందుబాటులో ఉంది.

Redmi 13C 5G లోని రెండు వేరియంట్లకు రెండు రకాల ధరలు అందుబాటులో ఉందని Xiaomi ఒక ప్రకటనలో తెలిపింది. 4GB+128 GB వేరియంట్‌కు రూ. 9,999, 6GB +128 GB కోసం రూ. 11,499 మరియు 8GB+256 GB వేరియంట్‌కు రూ. 13,499 ఆఫర్‌లతో ఉన్నాయని తెలిపింది. ఇక Mi , Amazon వెబ్ సైట్‌లలో మరియు దాని రిటైల్ స్టోర్‌లలో అమ్మకాలు ఈ నెల(డిసెంబర్)16, మధ్యాహ్నం నుండి ప్రారంభమవుతాయని ప్రకటించింది. మీరు ఒకవేళ Xiaomi కస్టమర్లు అయినట్లయితే ICICI క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్‌లతో రూ. 1,000 తక్షణ తగ్గింపు లేదా Redmi 13C 5G 8GB వేరియంట్‌పై రూ. 1,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్ స్టార్ట్ లైట్ బ్లాక్, స్టార్ట్ రైల్ సిల్వర్, స్టార్ట్ రైల్ గ్రీన్ కలర్స్ లో అందుబాటులో ఉంది. Redmi 13C 5G స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ను ఒకసారి పరిశీలిస్తే..

* 6.74 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే

* 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్

* వాటర్ డ్రాప్ నాచ్

* మీడియా టెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్

* ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టం

* 16 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

* వెనుకవైపు 50 మెగా పిక్సెల్ ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) మెయిన్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగా పిక్సెల్ డెప్త్ కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్

* ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

* సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్

* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

* 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్




Tags:    

Similar News