కొవిడ్ సమయంలో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. కొంత మంది ఈ ఖాళీ సమయాన్ని తమలోని టాలెంట్‌ను పెంచుకునేందకు వినియోగిస్తే..మరికొంతమంది బాడీ ఇమ్యూనిటీని పెంచుకునేందకు మెరుగైన ఆహారపు అలవాట్లపై ఫోకస్ పెట్టారు. ఇదే క్రమంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈఓ, ఫౌండర్ దీపిందర్ గోయల్ తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టారు. కరోనా లాక్‌డౌన్ టైమ్ లో డైట్ స్టార్డ్ చేసిన సీఈఓ భారీగా బరువు తగ్గించుకుని ఇప్పుడు అందరికీ ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. తన ఫిట్‌నెట్ జర్నీకి సంబంధించిన విషయాలను తాజాగా దీపిందర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.2019 నుంచి 2023 వరకు బరువు తగ్గడానికి ముందు తరువాత అంటూ పాత, కొత్త ఫొటోలను ఈ పోస్టులో షేర్ చేశారు. బరువు, కొలెస్ట్రాల్ లెవెల్స్ రాసుకున్న నోట్‌నూ పోస్ట్ చేశారు.
" 2017లోనే ఈ ఫిట్‌నెస్ ప్రయాణాన్ని స్టార్ట్ చేశాను. బిజినెస్ తో పాటు హెల్త్ కు ప్రియారిటీ ఇవ్వడం ప్రారంభించాను. అయితే దేనిని అతిగా చేయలేదు. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆపలేదు. ఫలితాలు ఇవే. 2019లో 87 కిలోలు ఉండేవాడిని. అలాంటిది 2023 నాటికి 15 కిలోలు తగ్గాను. ఇప్పుడు నా బరువు 72 కిలోలు. ప్రతి రోజు వ్యాయామం చేసేవాడిని. వాటికి తోడు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఫుడ్ నే తినేవాడిని. వీకెండ్స్ లో మాత్రమే గులాబ్ జామూన్, చికెన్ తినేవాడిని. అలా డైట్ మారుస్తూ ఉండటంతో మెరుగైన ఫలితాలు వచ్చేవి. ఇలా క్రమం తప్పకుండా ఫాలో అయ్యాను. ఈ మార్పే నా శారీరంపైన, మానసిక ఆరోగ్యంపైన ప్రభావాన్ని చూపింది" అంటూ తన ఫిట్‌నెస్ సీక్రెట్ మంత్రాను తెలిపారు దీపిందర్.