Amazon Festival Sale: అమెజాన్లో భారీగా తగ్గిన టీవీల ధరలు
ప్రతీ ఏడాది లాగే ఈసారి కూడా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ను అనౌన్స్ చేసింది. దసరా సందర్భంగా ప్రతీ ఏటా ఈ సేల్స్ నిర్వహిస్తుంటాయి ఈ కామర్స్ కంపెనీలు. అందులో భాగంగానే ఎలక్ట్రానిక్స్, క్లాతింగ్, హోంనీడ్స్ పై భారీ డిస్కౌంట్స్ ఇస్తుంటారు. కాగా ఈ ఏడాది సేల్స్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభం అవుతాయని అమెజాన్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. అందులో భాగంగానే ఒక్కొ ప్రొడక్ట్ పై ఇచ్చే ప్రైజ్ ను రివీల్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు టీవీలపై కూడా ఆఫర్స్, డిస్కౌంట్స్ ను రివీల్ చేసింది. శాంసంగ్, వన్ ప్లస్, సోనీ, ఎల్ జీ, షావోమీ లాంటి టాప్ బ్రాండ్స్ కూడా భారీ డిస్కౌంట్స్ ఇస్తున్నాయి.
* రెడ్ మీ 43 ఇంచ్ అల్ట్రా హెచ్డీ టీవీ మామూలుగా అయితే.. రూ. 42,999 ఉండగా.. ఆఫర్ లో రూ.20,499కే లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ కార్డ్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ లో రూ. 5500 డిస్కౌంట్ లభిస్తుంది.
* వన్ప్లస్ వై1ఎస్ ప్రో టీవీ ఆఫర్ లో రూ.26,999కే వస్తుంది. మామూలుగా ఈ టీవీ రూ. 39,999 ఉంటుంది. ఈ టీవీని నో కాస్ట్ ఈఎంఐతో కూడా కొనొచ్చు.
*ఎల్ జీ 50 ఇంచ్, 4కే అల్ట్రా హెచ్ డీ టీవీ MRP రూ.60,990 ఉండగా.. ఆఫర్ లో రూ.40,990కి వస్తుంది. ఇంకా కూపన్ తో రూ.1000 అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు.
* వీయూ మాస్టర్‌పీస్ Glo 55 ఇంచ్, క్యూఎల్‌ఈడీ టీవీ రూ.62,999కు వస్తుంది. ధీని MRP రూ.80వేల పైనే ఉంది. కూపన్ ద్వారా ఇంకా రూ.3000 డిస్కౌంట్ అదనం.
* రూ.52,900ల శాంసంగ్‌కు చెందిన క్రిస్టల్ 4కే ఐస్మార్ట్ యూహెచ్‌డీ టీవీ కేవలం రూ.32,990కే లభిస్తుంది. దీనిపై రూ. 1000 కూపన్ కూడా ఉంది.
* 65 ఇంచ్.. సోనీ బ్రేవియా 4కే అల్ట్రా హెచ్ డీ టీవీ రూ. 82,990కే వస్తుంది. దీని MRP రూ. 1,39,900.
* టీసీఎల్ ఎస్ సిరీస్ టీవీ 40 ఇంచ్.. రూ.16,990కే వస్తుంది. దీని అసలు MRP రూ. 40,900గా ఉంటుంది.
అమెజాన్ ఈ సేల్స్ లో ఎస్బీఐతో పార్ట్నర్ అయింది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ పై అదనంగా 10 శాతం డిస్కౌంట్స్ ఇస్తున్నారు. కొన్ని ప్రొడక్ట్స్ పై ఎక్స్ చేంజ్ ఆఫర్, డైరెక్ట్ కూపన్స్, నో కాస్ట్ ఈఎంఐతో వస్తుంటాయి. వాటిని గమనించి కొనుగోలు చేసుకోవచ్చు.