Reliance Industries Limited : రిలయన్స్ బోర్డు నుంచి తప్పుకున్న అంబానీ
భారతదేశ ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్య నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇన్నాళ్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఉన్న నీతా.. ప్రస్తుతం రాజీనామా చేశారు. నీతా స్థానాన్ని ఈషా అంబానీ, అనంత్ అంబానీ, ఆకాశ్ అంబానీలు భర్తీ చేయనున్నారు. ఆ ముగ్గురుని నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ముకేశ్ అంబానీ నియమించారు.
46 వార్షిక సమావేశాల సందర్భంగా మాట్లాడిన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. నియామకంపై నిర్ణయం తీసుకోవాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను కోరారు. గతకొన్నేళ్లుగా కంపెనీ వ్యవహారాల్లో పాలుపంచుకుంటున్న ఈ ముగ్గురికి.. రిటేల్, డిజిటల్, సర్వీస్, ఎనర్జీ రంగాలకు చెందిన వ్యాపారాలు చూసుకోనున్నారు. నీతా రిజైన్ చేసినా.. అన్ని బోర్డ్ మీటింగ్స్ కు హాజరవుతారు. పర్మనెంట్ ఇన్వెస్టీగా వ్యవహరిస్తారు. ఇక వోల్టాయిక్ ప్యానెల్స్, ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సిస్టమ్స్ కోసం నాలుగు గిగాఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.