Gold Price : బంగారం ఈరోజూ ఢమఢమాల్.. వెండి భారీగా పతనం..

Byline :  Mic Tv Desk
Update: 2023-09-30 12:50 GMT

బంగారం ధరల పనతం కొనసాగుతూనే ఉంది. శనివారం వరసగా ఐదో రోజు కూడా పసిడి పతనమైంది. 22 కేరట్ల బంగారం 10 గ్రాముల ధర గత ఐదు రోఃజులకు కలిపి రూ. 1,600 పతనమై రూ. 54,950 నుంచి రూ. 53,350కి చేరుకుంది. హైదరాబాద్ మార్కెట్లో 22 కేరట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 300 తగ్గి రూ. 53,350కు పడిపోయింది. 24 కేరట్ల మేలిమి బంగారం ధర రూ. 330 తగ్గి రూ. 58,200కు చేరుకుంది. శనివారం వెండి ధరలో భారీ పతనం నమోదైంది. కేజీ వెండి రూ. 1,500 తగ్గి రూ. 76,000కు పడిపోయింది.

డాలర్ విలువ బలపడి స్టాక్ మార్కెట్ పుంజేకోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసడికి డిమాండ్ తగ్గిపోతోంది. మన దేశంలో పెళ్లిళ్ల సీజన్, పండగ సీజన్ ముగియడంతో8 కొనుగోళ్లు పడిపోయాయి. అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్ల మరింత పెంచే యోచనలో ఉండడంతో మదుపర్ల బంగారానికి బదులు షేర్లపై మొగ్గుచూపుతున్నారు. త్వరలో పసిడి, వెండి ధరలు మరింత తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దసరా, దీపావళి సండగ సీజన్లలో ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది.


Tags:    

Similar News